Job Notification | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైద్య శాఖలో ఉద్యోగం కావాలని అనుకునే వారికి శుభవార్త. రాష్ట్రంలోని వైద్య విద్యా సంస్థల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి సంబంధించి మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు (MHSRB) తాజాగా నోటిఫికేషన్ను విడుదల చేసింది. వైద్య విద్య, సేవా రంగాల్లో అత్యంత ప్రాధాన్యత గల ఈ పోస్టుల కోసం త్వరలోనే అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది.
– దరఖాస్తు ప్రారంభం: జూలై 10, 2025
– దరఖాస్తుల ముగింపు: జూలై 17, 2025
– దరఖాస్తు విధానం: పూర్తిగా ఆన్లైన్ లోనే
ఈ పోస్టులకు ఆసక్తి ఉన్న, అర్హత కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ లో అప్లై చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియలో భాగంగా అభ్యర్థులు తమ వ్యక్తిగత వివరాలు, విద్యార్హతల పత్రాలు అప్లోడ్ చేసి, నిర్ణయించిన దరఖాస్తు ఫీజును చెల్లించాలి.
– అర్హతలు:
అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి సంబంధిత విభాగంలో పీజీ మెడికల్ డిగ్రీ (MD/MS/DNB) కలిగి ఉండాలి.
-ఇండియన్ మెడికల్ కౌన్సిల్/స్టేట్ మెడికల్ కౌన్సిల్ నుండి రెజిస్ట్రేషన్ తప్పనిసరి.
– ఇతర వివరాలు అధికారిక నోటిఫికేషన్ లో అందుబాటులో ఉంటాయి.
– జీతం:
ఎంపికైన అభ్యర్థులకు రూ. 68,900 నుంచి రూ. 2,05,500 వరకు నెలవారీ వేతనం చెల్లించనున్నారు. అదనంగా, ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇతర భత్యాలు కూడా వర్తిస్తాయి.
– ఎంపిక విధానం:
అభ్యర్థుల ఎంపికకు సంబంధించి రాత పరీక్ష, ఇంటర్వ్యూ నిర్వహించనున్నారు. విద్యార్హతలు, అనుభవం, పరీక్షల్లో పొందిన మార్కుల ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
ఇంకా ఏవైనా సందేహాలుంటే అభ్యర్థులు పూర్తి సమాచారం కోసం MHSRB అధికారిక వెబ్సైట్ https://mhsrb.telangana.gov.inను సందర్శించాలి. ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకండి. వైద్యవిద్యలో ప్రవేశించి ప్రజలకు సేవ చేయాలనుకునే అభ్యర్థులు సమయాన్ని వృథా చేయకుండా వెంటనే అప్లై చేసుకోవడం ఉత్తమం.