Choe Hyon | నౌకాదళంలోకి భారీ యుద్ధనౌకను ప్రవేశపెట్టిన ఉత్తరకొరియా.. అంతర్జాతీయ స్థాయిలో ప్రకంపనలు..!
Choe Hyon | ఉత్తరకొరియా (North Korea) తన నౌకాదళ చరిత్రలోనే అత్యంత కీలక ఘట్టానికి తెరలేపింది. భారీ యుద్ధనౌక (War ship) ను అధికారికంగా తన నౌకాదళంలో ప్రవేశపెట్టి అంతర్జాతీయ స్థాయిలో ప్రకంపనలు సృష్టించింది. 'చో హ్యోన్ (hoe Hyon)' అని పిలిచే 5,000 టన్నుల అత్యాధునిక డిస్ట్రాయర్‌ను దేశాధినేత కిమ్ జోంగ్ ఉన్ (Kim Jong Un) సమక్షంలో నౌకాదళంలోకి ప్రవేశపెట్టారు.
Choe Hyon : ఉత్తరకొరియా (North Korea) తన నౌకాదళ చరిత్రలోనే అత్యంత కీలక ఘట్టానికి తెరలేపింది. భారీ యుద్ధనౌక (War ship) ను అధికారికంగా తన నౌకాదళంలో ప్రవేశపెట్టి అంతర్జాతీయ స్థాయిలో ప్రకంపనలు సృష్టించింది. ‘చో హ్యోన్ (hoe Hyon)’ అని పిలిచే 5,000 టన్నుల అత్యాధునిక డిస్ట్రాయర్‌ను దేశాధినేత కిమ్ జోంగ్ ఉన్ (Kim Jong Un) సమక్షంలో నౌకాదళంలోకి ప్రవేశపెట్టారు. అణ్వాయుధాలను మోసుకెళ్లే సామర్థ్యం కలిగిన ఈ నౌకతో తమ నావికాదళాన్ని అణుశక్తిగా మార్చాలన్న కిమ్ ఆకాంక్ష ఈ చర్య ద్వారా స్పష్టమవుతోంది. పశ్చిమ తీరంలోని నాంపో నౌకాశ్రయంలో ఈ లాంచింగ్ కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న కిమ్ జోంగ్ ఉన్ మాట్లాడుతూ.. ‘గడిచిన ఏడు దశాబ్దాలుగా నౌకాదళంలో నెలకొన్న స్తబ్దతకు ఈ యుద్ధనౌకతో ముగింపు పలికాం’ అని వ్యాఖ్యానించినట్లు అక్కడి అధికారిక మీడియా తెలిపింది. కాగా విమాన విధ్వంసక వ్యవస్థలు, యాంటీ-షిప్ క్షిపణులతోపాటు అణు సామర్థ్యం కలిగిన క్రూయిజ్, బాలిస్టిక్ క్షిపణులను కూడా ‘చో హ్యోన్’ ప్రయోగించగలదు. ఇది ప్రధానంగా దేశ పశ్చిమ తీరంలో గస్తీ నిర్వహించనుంది. అక్కడి మీడియా కథనాల ప్రకారం యుద్ధనౌక లాంచింగ్ సందర్భంగా కిమ్ పలు కీలక ప్రకటనలు చేశారు. రాబోయే ఐదేళ్లలో ఏటా రెండు ‘చో హ్యోన్’ తరహా డిస్ట్రాయర్లను నిర్మిస్తామని వెల్లడించారు.
వీటితోపాటు 10 వేల టన్నుల భారీ యుద్ధనౌకలను, కొన్ని అత్యంత శక్తిమంతమైన ‘రహస్య జలాంతర్గత ఆయుధాలను’ కూడా అభివృద్ధి చేయాలని కిమ్ రక్షణ రంగాన్ని ఆదేశించారు. అమెరికా, దక్షిణ కొరియా సంయుక్త సైనిక విన్యాసాలను సమర్థవంతంగా ఎదుర్కోవడానికే ఈ ఆయుధ సమీకరణ చేపడుతున్నట్లు ఆయన స్పష్టంచేశారు. అంతర్జాతీయ ఆంక్షలు అమల్లో ఉన్నప్పటికీ ఈ డిస్ట్రాయర్‌ను పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతోనే నిర్మించినట్లు ఉత్తర కొరియా ప్రకటించింది. 2025లో జలప్రవేశం చేసిన ఈ నౌకపై ఇప్పటికే పలు దశల్లో పరీక్షలు నిర్వహించారు.
తాజా పరిణామాలు కొరియా ద్వీపకల్పంలో భద్రతా పరమైన ఉద్రిక్తతలను మరింత పెంచాయి. ఉత్తర కొరియా వేగంగా చేపడుతున్న సైనిక ఆధునికీకరణపై అమెరికా, దక్షిణ కొరియా దేశాలు తీవ్ర ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

