చెన్నై: తమిళనాడు ఆరోగ్యశాఖ మంత్రి సుబ్రమణియన్ ఉత్తరాది విద్యార్థులపై కామెంట్ చేశారు. తమిళనాడులో కోవిడ్ వ్యాప్తికి ఉత్తరాది విద్యార్థులే కారణమని ఆయన ఆరోపించారు. కేలంబాకమ్ వీఐటీ కాలేజీ, సత్యసాయి కాలేజీ విద్యార్థులకు కోవిడ్ వ్యాపించిందని, హాస్టళ్లు-క్లాసుల్లో ఆ విద్యార్థులకు వైరస్ సంక్రమిస్తున్నట్లు మంత్రి తెలిపారు. కొన్ని ఉత్తరాది రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు ఇంకా పెరుగుతున్నాయని మంత్రి సుబ్రమణియన్ వెల్లడించారు. గడిచిన 24 గంటల్లో తమిళనాడులో కొత్త 98 కోవిడ్ కేసులు నమోదు అయ్యాయి. అయితే కొత్తగా కోవిడ్ వల్ల ఎవరూ మరణించలేదు. చెంగళ్పట్టు, చెన్నై జిల్లాల్లో కొత్త కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది.