కొంతకాలంగా ఫామ్ లేమితో బాధపడుతున్న టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ గురించి సౌతాఫ్రికా మాజీ లెజెండ్, మిస్టర్ 360 ఏబీ డివిల్లీర్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఫామ్ లేనప్పుడు మరింత కష్టపడాలని కోహ్లీకి ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదని డివిల్లీర్స్ అన్నాడు. క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ ఆటగాళ్లలో కోహ్లీ ఒకడని చెప్పిన డివిల్లీర్స్.. ఫామ్ తాత్కాలికమని, కానీ క్లాస్ శాశ్వతంగా ఉంటుందని వివరించాడు.
విరాట్ ఎప్పటికి ప్రపంచ స్థాయి ఆటగాడిగానే కొనసాగుతాడన్నాడు. కోహ్లీ, తను మంచి మిత్రులమని, ఎప్పుడూ టచ్‌లోనే ఉంటామని చెప్పాడు. అయితే ఫామ్ లేని టైంలో మరింత ఎక్కువ కష్టపడాలని కోహ్లీకి తాను చెప్పాల్సిన అవసరం మాత్రం లేదని తేల్చేశాడు. అలాగే ఐపీఎల్లో ఏబీడీ ఆడిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు హాల్ ఆఫ్ ఫేంలో తన పేరు చేర్చే సమయంల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు చెప్పాడు.