న్యూఢిల్లీ: విమాన ప్రయాణికులకు ఎయిరిండియా చుక్కలు చూపించింది. విమానం ఆలస్యం కావడంతో గంటల తరబడి అందులోనే కూర్చోవాల్సి వచ్చింది. ఏసీలు పనిచేయకపోవడంతో ఊపిరాడక పలువురు ప్రయాణికులు స్పృహతప్పి పడిపోయారు. 200 మంది ప్రయాణికులతో శాన్ఫ్రాన్సిస్కో వెళ్లాల్సిన ఎయిరిండియాకు చెందిన ఏఐ 183 బోయింగ్ 777 విమానం వాస్తవానికి గురువారం మధ్యాహ్నం 3.30 గంటలకు ఢిల్లీ నుంచి బయలుదేరాల్సి ఉంది. అయితే సాంకేతిక కారణాలతో విమానం ఆలస్యం అయింది. చివరికి శుక్రవారం రాత్రి 9.55కి బయలుదేరింది.