న్యూఢిల్లీ, జూన్ 2: ఖనిజ ఉత్పత్తిలో అగ్రగామి సంస్థయైన ఎన్ఎండీసీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారీ లక్ష్యాలను నిర్దేశించుకున్నది. వచ్చే మార్చి నాటికి 55 మిలియన్ టన్నులు, ఇదే క్రమంలో 2030 నాటికి 100 మిలియన్ టన్నుల ఖనిజాన్ని ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు కంపెనీ సీఎండీ అమితవ ముఖర్జీ తెలిపారు. గడిచిన ఆర్థిక సంవత్సరంలో సంస్థ 45 మిలియన్ టన్నుల ఖనిజాన్ని ఉత్పత్తి చేసింది.
‘ఇరాన్ కార్గో దిగలేదు’
న్యూఢిల్లీ, జూన్ 2: ఇరాన్ నుంచిగానీ లేదా ఆ దేశానికి చెందిన ఏ షిప్ నుంచైనాగానీ వచ్చిన సరకును తమ ఆధ్వర్యంలోని పోర్టుల్లో దించలేదని అదానీ గ్రూప్ సోమవారం స్పష్టం చేసింది. గుజరాత్‌లోని ముండ్రా పోర్టు ద్వారా భారత్‌లోకి ఆంక్షల్ని ఉల్లంఘిస్తూ ఇరాన్ ఎల్పీజీని అదానీ గ్రూప్ సంస్థలు దిగుమతి చేసుకున్నాయా? అన్నదానిపై అమెరికా ప్రాసిక్యూటర్లు దర్యాప్తు చేశారంటూ వాల్‌స్ట్రీట్ జర్నల్‌లో వచ్చిన వార్తలకు అదానీ పైవిధంగా స్పందించింది.