లింగంపేట/రామారెడ్డి/నిజాంసాగర్, మార్చి 27 : యాసంగిలో రైతులు సాగు చేసిన ధాన్యాన్ని కేంద్ర ప్రభు త్వం కొనుగోలు చేయాలని డిమాండ్‌చేస్తూ మండలంలోని ఆయా గ్రామాల ఎంపీటీసీ సభ్యులు తీర్మానం చేశారు. ఆదివారం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ గరీబున్నీసా బేగం అధ్యక్షతన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. రైతులకు ఇబ్బందులు కలిగించకుండా కేంద్ర ప్ర భుత్వం ధాన్యాన్ని కొనుగోలు చేయాలని చేసిన తీర్మానం కాపీలను ప్రధాని నరేంద్ర మోదీకి పంపినట్లు తెలిపారు.
కార్యక్రమంలో మండల పరిషత్ ఉపాధ్యక్షుడు విఠల్‌రెడ్డి, ఎంపీటీసీ సభ్యులు దేవేందర్, గండిగారి వెం కటి, కో-ఆప్షన్ సభ్యుడు బాబుజానీ, నాయకులు నయీం, కిరణ్, గన్నూనాయక్, సిద్ధిరాములు, ఫతియొద్దీన్, విఠల్, కమ్మరి దత్తు, బొల్లు శ్రీకాంత్, యూత్ విభా గం మండల అధ్యక్షుడు నరేశ్ తదితరులు పాల్గొన్నారు. రామారెడ్డిలో మండల అధ్యక్షుడు నా రెడ్డి దశరథ్‌రెడ్డి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎంపీటీసీలు హాజ రై తెలంగాణ రాష్ట్రంలో వానకాలం, యాసంగిలో సాగు చేసిన వడ్లను కేంద ప్రభుత్వం కొనుగోలు చేయాలని తీర్మానించారు. కేంద్ర ప్రభుత్వం వడ్లు కొనుగోలు చేయాలంటూ ఎంపీపీ జ్యోతి అధ్యక్షతన నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశంలో తీర్మానించారు.
నిజాంసాగర్‌లో ఆదివారం నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశంలో ఎంపీపీ జ్యో తి, వైస్ ఎంపీపీ మనోహర్‌తోపాటు సభ్యులు కేంద్ర ప్రభుత్వం వడ్లు కొనుగోలు చేయాలంటూ తీర్మానించి కాపీని ప్రధాని నరేంద్రమోదీకి పోస్టు చేశారు. టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు దుర్గారెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సత్యనారాయణ, సర్పంచుల సంఘం అధ్యక్షుడు రమేశ్‌గౌడ్‌తోపాటు ఆయా గ్రామాలకు చెందిన ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు ఉన్నారు.