విద్యానగర్/బీర్కూర్/గాంధారి/ ఎల్లారెడ్డి రూరల్, మార్చి 23 : జిల్లా కేంద్రంలో బుధవారం ఎస్ఎఫ్ఐ, ఏఐటీయూసీ, ఏఐఎస్ఎఫ్, సీపీఐ ఆధ్వర్యంలో భగత్‌సింగ్ వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పలువురు నాయకులు మాట్లాడుతూ స్వాతంత్య్ర పోరాటంలో ఆయన త్యాగాలను గుర్తుచేసుకున్నారు. భగత్‌సింగ్‌కు భారతరత్న ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు అరుణ్, ఉపాధ్యక్షుడు సతీశ్, సీపీఐ జిల్లా కార్యదర్శి దశరథ్, బాలరాజు తదితరులు పాల్గొన్నారు.
బీర్కూర్‌లోని మల్లాపూర్ చౌరస్తాలో భగత్‌సింగ్ విగ్రహానికి మాజీ జడ్పీటీసీ ద్రోణవల్లి సతీశ్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో ఎంపీపీ తిలకేశ్వరి రఘు, ఎంపీటీసీ సందీప్పటేల్, మండల కో-ఆప్షన్ సభ్యుడు ఆరిఫ్, నాయకులు లాడేగాం గంగాధర్, రాజు పటేల్, మన్నాన్, బేగరి గంగారాం, కొరిమె రఘు, బాలరాజ్, రవీందర్‌గౌడ్ పాల్గొన్నారు.
గాంధారిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు సతీశ్ భగత్‌సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పీడీఎస్‌యూ నాయకులు మోజీరాం, నితీన్, కష్ణ, ఉపేందర్, రాజేశ్, సునీల్, ధరం సింగ్, అజయ్, సందీప్ ఉన్నారు.
ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలోని గండిమాసానిపేట్ సొసైటీ వద్ద బీజేవైఎం నాయకులు షహీద్ దివస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సొసైటీ వద్ద స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని చేపట్టినట్లు బీజేవైఎం ఎల్లారెడ్డి అధ్యక్షుడు నరేశ్ తెలిపారు. సొసైటీ పరిస రాల్లోని చెత్తను, పిచ్చిమొక్కలను తొలగించామన్నారు. కార్యక్రమంలో బీజేవైఎం నాయకులు కాశీ, శివ తదితరులున్నారు.