తాడ్వాయి, మార్చి 23 : కుర్మ కులస్తులు ఆర్థికంగా, రాజకీయంగా, విద్యాపరంగా రాణించాలని ఎమ్మెల్యే జాజాల సురేందర్, ఎమ్మెల్సీ ఎగ్గె మల్లేశం అన్నారు. మండలంలోని దేవాయిపల్లి గ్రామంలో కుర్మ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దొడ్డి కొమురయ్య విగ్రహాన్ని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కలిసి బుధవారం ఆవిష్కరించారు. అనంతరం ఏర్పా టు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. కుర్మ కులస్తుల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం గొర్రెలను పంపిణీ చేపట్టిందని, రెం డో విడుత గొర్రెల పంపిణీ కార్యక్రమం మరో రెండు నెలల్లో ప్రారంభమవుతుందని అన్నారు. తమ పిల్లలను ఉన్నత చదువులు చదివించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసేదాక అందరూ కలిసి పోరాటం చేయాలని కోరారు.
జిల్లా కేంద్రంలో కుర్మ కుల సంఘం భవన నిర్మాణానికి రూ.50 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ఎమ్మెల్సీ ఒగ్గే మల్లేశం ప్రకటించారు. జిల్లా కేంద్రంలో స్థలాన్ని కేటాయిస్తే సీఎం కేసీఆర్ వద్దకు వెళ్లి భవన నిర్మాణానికి రూ.రెండు కోట్లు మం జూరు చేయిస్తానని అన్నారు. కుర్మలు దొడ్డి కొమురయ్య స్ఫూర్తితో అభివృద్ధిని సాధించాలని, ఆయన ఆశయ సాధన కోసం కుర్మ సంఘాల సభ్యులు ముందుకు రావాలని దొడ్డి కొమురయ్య మనుమడు చంద్రం అన్నారు. కుర్మ సంఘం జిల్లా అధ్యక్షుడు మర్కంటి భూమన్న, ఎంపీపీ రవి, జడ్పీటీసీ రమాదేవి, సర్పంచ్ రాణి, ఎంపీటీసీ సునిత, సొసైటీ చైర్మన్ కపిల్‌రెడ్డి, సీడీసీ చైర్మన్ మహేందర్‌రెడ్డి, వైస్‌ఎంపీపీ నర్సింహులు, నాయకులు సాయిరెడ్డి, రవీందర్‌రెడ్డి, కుర్మ సంఘం సభ్యులు గంగారాం, బీరయ్య, మల్లయ్య, ఎంపీటీసీలు, సర్పంచులు, నాయకులు పాల్గొన్నారు.