నమస్తే తెలంగాణ యంత్రాంగం, అక్టోబర్ 27: జిల్లాలోని పలు ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను బుధవారం ప్రారంభించారు. ఆర్మూ ర్ మండలం అంకాపూర్ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర మార్క్‌ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభు త్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు ధాన్యా న్ని విక్రయించి మద్దతు ధరను పొందాలన్నారు. రైతులు నాణ్యమైన ధాన్యా న్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలన్నారు. పిప్రి సొసైటీ పరిధిలోని మగ్గిడి, అమ్దాపూర్‌లో కొనుగోలు కేంద్రాలను సొసైటీ చైర్మన్ సోమ హేమంత్‌రెడ్డి ప్రారంభించారు. మాక్లూర్ మండలం వెంకటాపూర్‌లో మండల మహిళా సమాఖ్య(ఐకేపీ) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్‌రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నారని అన్నారు. స్వగ్రామం వెంకటాపూర్‌లో ఐకేపీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసేందుకు మంత్రి, కలెక్టర్‌తో మాట్లాడి మంజూరు చేయించానని చెప్పారు. వెంకటాపూర్, రాంపూర్ గ్రామాల మహిళా సంఘాలు జిల్లాలో ఇతర మహిళా సంఘాలకు ఆదర్శంగా నిలవాలన్నారు. భీమ్‌గల్ మండలం జాగిర్యాల్‌లో భీమ్‌గల్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సొసైటీ చైర్మన్ శివసారి నర్సయ్య సర్పంచ్ మానసతో కలిసి ప్రారంభించారు. మోర్తాడ్ మండలం దోన్పాల్, వడ్యాట్ గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను మోర్తాడ్ సొసైటీ చైర్మన్ కల్లెం అశోక్ ప్రారంభించారు. కమ్మర్‌పల్లిలో స్థానిక పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పీఏసీఎస్ చైర్మన్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రేగుంట దేవేందర్ ప్రారంభించారు. బోధన్ మండలం పెగడాపల్లిలో సొసైటీ చైర్మన్ రాజారెడ్డి, కల్దుర్కిలో ఎంపీపీ బుద్దె సావిత్రి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు.
నవీపేట సొసైటీ ఆధ్వర్యంలో ఫత్తేనగర్, రాంపూర్, లక్ష్మీకిసాన్ఫాంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను ఎంపీపీ సంగెం శ్రీనివాస్ సర్పంచ్ రుతు కల్పణతో కలిసి ప్రారంభించారు. రెంజల్ మండలం వీరన్నగుట్ట గ్రామంలో ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాన్ని స్థానిక నాయకులు, అధికారులతో కలిసి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జడ్పీటీసీ విజయ ప్రారంభించారు. ముప్కాల్ మండలం వేంపల్లిలో పీఏసీఎస్ ఆధ్వర్యం లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని సొసైటీ చైర్మన్ జక్క రాజేశ్వర్ ప్రారంభించారు. డిచ్పల్లి మండలం అమృతాపూర్ లో ఐడీసీఎంఎస్ చైర్మన్ సాంబారి మోహన్‌తో కలిసి ధర్పల్లి, డిచ్పల్లి జడ్పీటీసీలు బాజిరెడ్డి జగన్, దాసరి ఇందిర ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.