నిజామాబాద్ రూరల్/ఇందల్వాయి/జక్రాన్‌పల్లి/కోటగిరి/ఎడపల్లి(శక్కర్‌నగర్), నవంబర్ 6 : పోడు భూములను పంట సాగు చేస్తున్న చిన్న, సన్నకారు రైతుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని అధికారులు, ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు. ఇందులో భాగంగా గ్రామ స్థాయిలో ప్రత్యేక కమిటీలను వేస్తున్నట్లు తెలిపారు.
పోడుభూముల పరిష్కార చర్యల్లో భాగంగా జిల్లాలో శనివారం ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. నిజామాబాద్ రూరల్‌మండలం మల్లారంలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పద్మారావు పోడుభూములు సాగుచేస్తున్న రైతులతో సమావేశమయ్యారు. పూర్తిస్థాయిలో వివరాలను సేకరించేందుకు ప్రత్యేక కమిటీని నియమిస్తున్నట్లు తెలిపారు. పదిమందితో కమిటీని ఏర్పాటు చేశారు. సమావేశంలో వైస్ ఎంపీపీ అన్నం సాయిలు, సర్పంచ్ నగేశ్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ భాస్కర్, బీట్ ఆఫీసర్ అర్చన తదితరులు పాల్గొన్నారు.
ఇందల్వాయి గ్రామ పంచాయతీలో నిర్వహించిన సమావేశానికి ముఖ్యఅతిథిగా బీట్ ఆఫీసర్ పవన్ హాజరై మాట్లాడారు. పోడు భూములు కలిగి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని, పోడు భూములపై విధివిధానాలు రూపొందుతున్నాయని, గ్రామంలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసుకోవాలని సర్పంచ్ పాశం సత్తెవ్వకు సూచించారు. సమావేశంలో ఉపసర్పంచ్ రాజేందర్, ఎంపీటీసీ మారంపల్లి సుధాకర్, సభ్యులు పాశంకుమార్, నవీన్‌గౌడ్, వాచర్ మల్లయ్య, గొల్ల గంగాధర్, శంకర్, మాణిక్యం, గంగాధర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
జక్రాన్‌పల్లి గ్రామ పంచాయతీలో నిర్వహించిన సమావేశానికి ఎంపీపీ హరిత ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. జడ్పీటీసీ తనూజ, సర్పంచ్ జక్కం చంద్రకళ, ఉప సర్పంచ్ బాలకిషన్, ఎంపీటీసీ గడ్డం గంగారెడ్డి, అర్గుల్ సొసైటీ చైర్మన్ గంగారెడ్డి, మండల ప్రత్యేకాధికారి లక్ష్మణ్, అటవీ శాఖ అధికారి, గ్రామస్తులు పాల్గొన్నారు.
అటవీభూములను కాపాడేందుకు గ్రామ కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు కోటగిరి జడ్పీటీసీ శంకర్‌పటేల్ పేర్కొన్నారు. మండలంలోని కొత్తపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కొత్తపల్లి, సుద్దులంతండా పరిధిలో పోడుభూములు సాగుచేస్తున్న రైతులకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు. అటవీ భూములను కాపాడేందుకే జిల్లా అధికారుల ఆదేశాల మేరకు అటవీ సంరక్షణ గ్రామ కమిటీలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. సమావేశంలో సర్పంచ్ భారతి, ఏఎంసీ మాజీ చైర్మన్ నీరడి గంగాధర్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఎజాజ్‌ఖాన్, గ్రామ శాఖ అధ్యక్షుడు సుదర్శన్, సూపరింటెండెంట్ భానుప్రకాశ్, కృష్ణారెడ్డి, పంచాయతీ కార్యదర్శి స్వప్న, అశోక్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పోడుభూములను సాగుచేస్తున్న రైతులు ప్రభుత్వ నిబంధనల మేరకు ఈనెల 8 నుంచి దరఖాస్తు చేసుకోవాలని ఎడపల్లి ఎంపీడీవో శంకర్ సూచించారు. జాన్కంపేట్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో అటవీశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సమావేశంలో అటవీశాఖ అధికారులు నవీన్, ప్రతాప్, స్థానిక సర్పంచ్ సాయిలు, ఎంపీటీసీ సంజీవ్ , గ్రామస్తులు పాల్గొన్నారు.