ముప్కాల్, నవంబర్ 9 : విద్యార్థులకు మెనూ ప్రకారం పౌష్టికాహారాన్ని అందించాలని డీఈవో దుర్గాప్రసాద్ అన్నారు. బాల్కొండ మండల కేంద్రంలోని కేజీబీవీ, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను, వన్నెల్(బీ) గ్రామంలోని ప్రాథమిక, ఉన్నత పాఠశాలలను మంగళవారం ఆకస్మికంగా పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడుతూ.. చేతులు శుభ్రం చేసుకొని ఆహారాన్ని తీసుకోవాలన్నారు. మెనూ ప్రకారం ఆహారం అందుతుందా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. మధ్యా హ్న భోజనాన్ని పరిశీలించారు. ఆయన వెంట ఎంఈవో రాజేశ్వర్, ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్, రామస్వామి ఉన్నారు.
మధ్యాహ్న భోజనం పరిశీలన..
రెంజల్, నవంబర్ 9 : మండలంలోని బాగేపల్లిలో మంగళవారం మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించినట్లు ఎంపీడీవో గోపాలకృష్ణ తెలిపారు. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనాన్ని అందించాలని ఏజెన్సీ నిర్వాహకులకు ఆదేశించారు. పారిశుద్ధ్యంపై నిర్లక్ష్యం వహిస్తున్న కార్మికులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎంపీవో గౌసొద్దీన్, ఉప సర్పంచ్ సుంకరి సుదర్శన్, మాజీ సర్పంచ్ సురేందర్‌గౌడ్, కార్యదర్శి నవీన్‌కుమార్, గ్రామస్తులు ఉన్నారు.
విద్యార్థుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలి
ఆర్మూర్, నవంబర్ 9 : ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల వివరాలను ఆన్లైన్లో తప్పనిసరిగా నమోదు చేయాలని ఆర్మూ ర్ ఎంఈవో రాజగంగారాం అన్నారు. ఆర్మూర్‌లోని మండల విద్యావనరుల కేంద్రంలో ఆర్మూర్ పట్టణ, మండలంలోని ప్రభు త్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో మంగళవారం సమావే శాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఈవో మాట్లాడుతూ.. విద్యార్థుల వివరాలను చైల్డ్ ఇన్ఫో వెబ్సైట్లో నమోదు చేయా లన్నారు. మెనూ ప్రకారం విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించాలన్నారు. సమావేశంలో ప్రధానోపాధ్యాయులు కవిత, హరిత, మగ్గిడి లక్ష్మీనర్సయ్య తదితరులు పాల్గొన్నారు.