నిజాంసాగర్, నవంబర్ 7: జుక్కల్ నియోజకవర్గంలోని పలు గ్రామాలకు డబుల్ రోడ్డు నిర్మాణంతో ఎన్నో ఏండ్లుగా పడుతున్న ఇబ్బందులు తొలగాయని ఎమ్మెల్యే హన్మంత్ షిండే అన్నారు. జుక్కల్ మండలంలోని పెద్దఏడ్గి నుంచి గుల్లతండా వరకు తొమ్మిది కిలో మీటర్ల రహదారిని డబుల్ రోడ్డుగా మార్చి పనులు కొనసాగుతుండడంతో ఆదివారం జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్‌షిండే పెద్దఏడ్గి నుంచి కంఠాలి వరకు ఐదు కిలో మీటర్ల మేర పాదయాత్ర చేపట్టారు. పాదయాత్రలో ప్రజలు అడుగడుగునా ఘన స్వాగతం పలికారు. చిన్నారులు సైతం చేతిలో టీఆర్ఎస్ జెండాను పట్టుకొని జై కేసీఆర్ అంటూ నినాదాలు చేస్తూ పాదయాత్రలో పాలుపంచుకున్నారు. ఎమ్మెల్యే షిండే తనయుడు హరీశ్షిండే, హరీశ్షిండే యువసేన యూత్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పెద్దఏడ్గి నుంచి గుల్లతండా, మహారాష్ట్ర సరిహద్దు వరకు రహదారి నిర్మాణ పనులకు రూ.12.50 కోట్ల నిధులు మంజూరైనట్లు తెలిపారు. నెల రోజుల్లో పనులు పూర్తికానున్నాయని చెప్పారు. ప్రజల ఆశీస్సులతో మూడుసార్లు తాను ఎమ్మెల్యేగా గెలిచానని, వారికి సేవ చేసేందుకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని అన్నారు. సమైక్య పాలనలో జుక్కల్ నియోజకవర్గానికి నిధులు విడుదలకాకపోవడంతో అన్ని రంగాల్లో వెనుకబడిందన్నారు. స్వరాష్ట్రం లో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ సహకారంతో నియోజకవర్గంలో రహదారుల నిర్మాణాలు పూర్తిచేసుకున్నామని తెలిపారు. ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్‌లో ఉన్న రోడ్లు, భవనాల శాఖకు చెందిన రోడ్లను రూ.250 కోట్లతో డబుల్ రోడ్లు గా మార్చుకున్నామన్నారు. పెద్దఏడ్గి నుంచి గుల్ల వరకు రూ.12.50 కోట్లతో రహదారి నిర్మాణ పనులు పూర్తయినట్లు తెలిపారు. మరో రూ. 2.50 కోట్లు విడుదల చేస్తే మహారాష్ట్ర సరిహద్దు వరకు పనులు పూర్తికానున్నాయని మంత్రి దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపా రు. పిట్లం-బాన్సువాడ డబుల్ రోడ్డును రూ.24 కోట్ల తో పూర్తిచేశామని, అక్కడక్కడ కొన్ని కారణాలతో పను లు పెండింగ్‌లో ఉన్నాయని త్వరలో పూర్తిచేస్తామన్నా రు. ఎంపీ బీబీ పాటిల్ కృషితో సంగారెడ్డి నుంచి మ ద్నూర్ వరకు జాతీయ రహదారిగా మార్చనున్నట్లు తెలిపారు. త్వరలో మద్నూర్-పొతంగల్, కరీంనగర్-పిట్లం రహదారుల పనులు కూడా ప్రారంభం కానున్నాయని అన్నారు. నిజాంసాగర్ మండలంలోని నాగమడుగు మత్తడి కోసం రూ.476 కోట్లు మంజూరైనట్లు తెలిపారు. పనులు ప్రారంభించేందుకు సీఎం కేసీఆర్ రానున్నారని చెప్పారు. కార్యక్రమంలో మద్నూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ సాయాగౌడ్, నాయకులు నీలుపటేల్, మాధవ్రావ్దేశాయ్, గంగాధర్, భానుగౌడ్, లింబాద్రి, ఆయా గ్రామాల నాయకులు పాల్గొన్నారు.