పిట్లం, నవంబర్ 7 : మండలానికి చెందిన నలుగురు గిరిజన విద్యార్థినులు అక్షర, సంధ్యారాణి, ప్రియాంక, సోని జాతీయస్థాయి అండర్-17 కబడ్డీ పోటీలకు ఎంపికయ్యారు. నేపాల్‌లో జరగనున్న జాతీయస్థాయి పోటీలకు వెళ్లేందుకు ఆర్థిక స్థోమత లేకపోవడంతో జహీరాబాద్ పార్లమెంట్ సభ్యుడు బీబీపాటిల్ లక్ష రూపాయల నగదును పంపించారు. వీటిని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వాసరి రమేశ్, జడ్పీటీసీ సభ్యుడు శ్రీనివాస్‌రెడ్డి క్రీడాకారులకు ఆదివారం అందజేశారు. టీఆర్ఎస్ నాయకులు విజయ్, బాబుసింగ్, ప్రతాప్‌రెడ్డి, విజయ్దేశాయ్, జగదీశ్, శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.
రిటైర్డ్ ఆర్మీ జవాన్ కుటుంబానికి ఆర్థిక సహాయం
మద్నూర్, నవంబర్ 7 : మండలకేంద్రానికి చెందిన రిటైర్డ్ ఆర్మీ జవాన్ కాంబ్లే రాజు ఇటీవల మృతిచెందాడు. బాధిత కుటుంబానికి జిల్లా ఎక్స్ ఆర్మీ యూనియన్ అసోసియేషన్ సభ్యులు మృతుడి భార్యకు రూ.51 వేల నగదును అందజేశారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే హన్మంత్‌షిండే దృష్టికి తీసుకెళ్లి ఐదెకరాల ప్రభుత్వ స్థలం ఇప్పించేందుకు కృషిచేస్తామని అన్నారు. ప్రభుత్వం ద్వారా వచ్చే రూ. 2లక్షల సహాయాన్ని త్వరగా అందేలా చూస్తామన్నారు. టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సంగమేశ్వర్, జిల్లా అధ్యక్షుడు రాజారెడ్డి, ఉపాధ్యక్షుడు సాయిరెడ్డి, కార్యదర్శులు బాలకిషన్, కృష్ణ, సభ్యులు పీర్యా, రాజు, గోపి, బస్వరాజ్, బాలాజీ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.