నిజామాబాద్ రూరల్, నవంబర్ 7 : గ్రామీణ ప్రాంతాల ప్రజలందరూ చట్టాలపై అవగాహన పెంపొందించుకోవడం తో పాటు న్యాయ సేవాధికార సంస్థ అం దిస్తున్న న్యాయ సేవలను సద్వినియో గం చేసుకోవాలని జిల్లా కోర్టు సీనియర్ సివిల్ జడ్జి జగన్నాథం విక్రమ్ పిలుపునిచ్చారు. ఆదివారం మల్కాపూర్(ఎ), జ లాల్పూర్, పాల్దా, గుండారం, శ్రీనగర్ గ్రామాల్లో పాన్ ఇండియా న్యాయ అవగాహన విస్తరణ కార్యక్రమంలో భాగం గా ప్రజలకు వివిధ చట్టాలపై నిర్వహించిన సమావేశాల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.ప్రజలు వివిధ సమస్యలను ఎదుర్కొంటున్న క్ర మంలో చట్టాలపై అవగాహన లేకపోవ డంతోనే ఘర్షణలకు దిగి పోలీస్స్టేషన్ల లో కేసులు నమోదై కోర్టుల చుట్టూ తిరిగే దుస్థితి నుంచి విముక్తి పొందడానికే న్యా య సేవాధికార సంస్థ న్యాయ చైతన్య సేవా కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహిస్తున్నదన్నారు. ప్రతిఒక్కరూ చట్టాల పై అవగాహన కలిగి ఉంటే వివాదాలు తలెత్తే అవకాశం ఉండబోదని జడ్జి స్ప ష్టం చేశారు. సమాజంలోని ప్రజల దైనందిన జీవితం చట్టాలతోనే ముడిపడి ఉం దని పేర్కొన్నారు. జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు, భూముల చట్టాలు, ఉ పాధిహామీ పథకం, విద్యాహక్కు, పంచాయతీరాజ్ వంటి తదితర చట్టాలు ప్రజల బాగు కోసమే రూపొందించబడ్డాయని తెలిపారు. చట్టాలకు వ్యతిరేకంగా ప్రవర్తించే వారిని శిక్షించడానికి అవే చట్టాలు దోహదపడుతున్నాయని పేర్కొన్నారు. ధర్మారం (ఎం), ధర్మారం తండా, ముత్తకుంట గ్రామా ల్లో న్యాయ సేవా చట్టాలపై అవగాహన కల్పించారు. న్యాయ సేవా చట్టం, బాలలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం, భారత రాజ్యాంగం గురించి న్యాయసేవాధికార సంస్థ ప్యానల్ న్యా యవాది దాసరి పుష్యమిత్ర అవగాహన కల్పించారు. నిజామాబాద్ మండలంలో మొ త్తం 18 గ్రామాల్లో చట్టాలపై అవగాహన కార్యక్రమాలు విజయవంతంగా ముగిశాయి. కార్యక్రమాల్లో న్యాయవాదులు మానిక్‌రాజ్, ఆశానారాయణ, వెంకటేశ్వర్, సాయన్న, ఇందూరు యువత అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ మద్దుకూరి సాయిబాబు, సర్పంచులు శేఖర్‌గౌడ్, సురేందర్‌రెడ్డి, సుప్రియానవీన్, లక్ష్మణ్‌రావు, సునీత రాంగోపాల్‌రెడ్డి, జలందర్గౌడ్, గంగారాంనాయక్, ఉపసర్పంచ్లు, వలంటీర్లు పాల్గొన్నారు.