ఖలీల్‌వాడి, నవంబర్ 6: ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) బాధ్యులు సమాజ సేవలో భాగస్వాములు కావాలని ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఎం.సంపత్‌రావు సూచించారు. నిజామాబాద్‌లోని ఐఎంఏ హాల్లో శనివారం నిర్వహించిన జిల్లా కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నూతన కార్యవర్గసభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఐఏంఏ కార్యాచరణలో ముందంజలో ఉండాలని సూచించారు. కార్యక్రమానికి జాతీయ వైద్యుల సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ ఏలేటి రవీంద్రారెడ్డి, ప్రెసిడెంట్ ఎలెక్ట్ డాక్టర్ బీఎన్‌రావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డాక్టర్ ద్వారకనాథ్‌రెడ్డి, పలువురు వైద్యులు హాజరై నూతన కార్యవర్గసభ్యులకు అభినందనలు తెలిపారు.
నూతన కార్యవర్గ సభ్యులు వీరే..
ఐఎంఏ జిల్లా అధ్యక్షుడిగా డాక్టర్ సుభాష్, ప్రెసిడెంట్ ఎలెక్ట్ 2022-23గా డాక్టర్ నీలి రాంచందర్, ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ జలగం తిరుపతిరావు, ఉపాధ్యక్షులుగా డాక్టర్లు శివప్రసాద్, ఆకుల విశాల్, ఫరీదా బేగం, సహాయ కార్యదర్శులుగా డాక్టర్లు ఎండీ రషీద్ అలీ, వొక్కెర్ల కిరణ్ రావు, కొండా సంతోష్‌కుమార్, కోశాధికారిగా హరీశ్ స్వామి, కార్యవర్గ సభ్యులుగా డాక్టర్లు వీ రాజేశ్, కప్పల రాజేశ్, గోపాల్ సింగ్, రాజేంద్రప్రసాద్, అర్జున్ కుమార్, అంకం గణేశ్, విజయభాస్కర్ రెడ్డి, వెంకన్న, చంద్రశేఖర్ రెడ్డి, జగన్ కుమార్, డి.స్మిత, వందన, శైలజ, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా డాక్టర్ కౌలయ్య ఎన్నికయ్యారు. వీరితో పాటు రాష్ట్ర కౌన్సిల్ ప్రతినిధులుగా డాక్టర్లు బాపురెడ్డి, పీవీ రామకృష్ణన్, వినోద్‌కుమార్ గుప్తా, జీవన్ రావు, సంధ్యారాణి, హరిప్రసాద్ రావు, భూమారెడ్డి, ద్వారకాదేవి, అజ్జా శ్రీనివాస్, ఆకుల విశాల్, జాతీయ కౌన్సిల్ ప్రతినిధులుగా డాక్టర్లు శ్రీహరి, దామోదార్ రావు, సాంబశివరావు, డీఎల్ఎన్ స్వామి ఎన్నికయ్యారు.