అడవుల సంరక్షణతోపాటు పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఇందుకోసం కార్యాచరణ రూపొందించి అమలుచేస్తున్నది. ముందుగా పోడు భూముల్లో సాగు చేసుకుంటున్న వారి నుంచి దరఖాస్తుల స్వీకరణను ప్రారంభించింది. అటవీ భూములను ఆక్రమించిన వారిలో గిరిజనులై.. 2006కు ముందునుంచీ సాగులో ఉండాలి. పది ఎకరాలలోపు కబ్జాలో ఉండి.. ఆ భూమే జీవనాధారంగా ఉంటే ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు పొందేందుకు అర్హులు. గిరిజనేతరులైతే ఆ కుటుంబం మూడుతరాల నుంచీ ఆ భూమిలో సాగు చేసుకుంటున్నట్లు ఆధారాలు చూపాలి. పోడు భూముల సమస్యను త్వరగా పరిష్కరించేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించేలా ప్రభుత్వం చర్యలు చేపడుతున్నది. డిజిటల్తోపాటు శాటిలైట్ చిత్రాల ద్వారా హద్దులను గుర్తించేందుకు సిద్ధమైంది. ఏండ్లుగా పోడు భూమిని నమ్ముకున్న వారికి న్యాయం చేసేందుకు రాష్ట్రప్రభుత్వం నడుం బిగించడంతో అర్హుల్లో హర్షం వ్యక్తమవుతున్నది. పోడు భూముల క్రమబద్ధీకరణకు ఉమ్మడి జిల్లాలో దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. ఈ నెల 8తో దరఖాస్తుల స్వీకరణ గడువు ముగియనున్నది.
నిజామాబాద్, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మానవ మనుగడకు అడవుల సంరక్షణ ఎంతో కీలకం. నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తు తరాలకు ఒక్క చెట్టూ మిగలదు. అడవు ల రక్షణ, పచ్చదనం పెంచడం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు గొప్ప ఫలితాలు ఇస్తున్నాయి. బయో డైవర్సిటీ సై తం వెల్లివిరుస్తున్నది. నిజామాబాద్, కామారెడ్డి జి ల్లాల్లో గతంతో పోలిస్తే అటవీ సంపద పరిరక్షించబడుతున్నది. హరితహారం కార్యక్రమం ద్వారా సా ధిస్తున్న ఫలితాలతో దేశానికే రాష్ట్రం ఆదర్శంగా ని లుస్తున్నది. హరితనిధి కార్యక్రమానికి విశేష స్పందన వచ్చింది. బయటి నుంచి వచ్చి అటవీ భూములను ఆక్రమించి, అడవిని నరికి, దుర్వినియోగం చేసే వారితోనే సమస్య తలెత్తుతున్నది. వారి స్వార్థానికి అడవులు బలి అవుతున్నాయి. పోడు భూముల సమస్య పరిష్కారమైన మరుక్షణం నుంచే అటవీ భూముల రక్షణ కోసం ప్రభు త్వం పటిష్ట చర్యలు చేపట్టనున్నది. ఆ తర్వాత అడవుల్లోకి అక్రమ చొరబాట్లు లేకుండా చూసుకునే బాధ్యత అటవీ శాఖదేనని ఇప్పటికే సర్కారు స్ప ష్టం చేసింది. రేయింబవళ్లు ఒక్క చెట్టు కూడా నరికివేతకు గురి కాకుండా చూసేలా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. సీఎం కేసీఆర్ ఆదేశాలతో ఇప్పటికే పోడు సాగుదారుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. త్వరలోనే అటవీ భూ ములపై సర్వే సైతం చేపట్టి కచ్చితమైన సమాచారాన్ని సేకరించనున్నారు.
ఇదీ లెక్కా…
అటవీ భూములను ఆక్రమించిన వారిలో గిరిజనులే అయితే 2006కు ముందు నుంచి సాగులో ఉండాలి.అలాంటి వారి ఆర్థిక స్థితిగతులు వివరా లు చూస్తారు. పది ఎకరాలలోపు కబ్జాలో ఉండి… ఆ భూమే జీవనాధారంగా ఉంటే ఆర్వోఎఫ్ఆర్ ప ట్టాలు పొందేందుకు అర్హులు. ఇందుకోసం నవంబర్ 8 నుంచి డిసెంబర్ 8 వరకు అర్హులైన వారి క్లెయిమ్స్ స్వీకరిస్తున్నారు. సాగు చేసుకుంటున్న వారు ఆధారాలతో ఎఫ్డీవో స్థాయి అధికారులకు దరఖాస్తులు అందజేయాలి. గ్రామ, డివిజినల్ కమిటీలు క్షేత్ర స్థాయిలో పరిశీలించి సిఫార్సు చేస్తా యి. ఆఖరున జిల్లా కమిటీ అర్హులను ఎంపిక చే స్తుంది. గిరిజనేతరులైతే ఆ కుటుంబం నుంచి మూ డుతరాల వారు ఆ భూమిలో సాగు చేసుకుంటున్నట్లు ఆధారాలుండాలి. అటవీ భూముల్లో సాగు చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్న వారు జి ల్లాలో 19 మండలాల్లో ఉన్నారు. ప్రధానంగా భీ మ్గల్, సిరికొండ, వర్ని, ఇందల్వాయి పరిధిలోనే ఎక్కువ భూములు ఆక్రమణలో ఉన్నాయి. నిజామాబాద్ జిల్లాలో మొత్తం అటవీ భూమి 2,14, 700.33 ఎకరాలు ఉంది. ఇందులో ఆక్రమణకు గురైంది దాదాపు 12వేల ఎకరాల వరకు ఉంటుం ది. సమస్య ఉన్న గ్రామాలు 75 వరకు గుర్తించా రు. రెవెన్యూ, అటవీ శాఖల సరిహద్దు వివాదంలో 10,599 ఎకరాలు ఉంది.ఆక్రమణకు యత్నించిన వారిపై మూడేండ్లలో 287 కేసులు పెట్టారు.
అటవీ భూముల పరిరక్షణే ధ్యేయంగా…
ఉమ్మడి రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం గణనీయంగా ప డిపోయింది. సువిశాలమైన అడవి ఇప్పుడు ఎక్కడ చూసిన ఆక్రమణలతో కకావికలమైంది. కాంగ్రెస్ పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో బడాబాబులు అనేక మంది పోడు పేరుతో సామాన్యులను ముందు పెట్టి విలువైన భూములను ఆక్రమించారు. దర్జాగా అటవీ భూమిని చేతుల్లోకి తీసుకుని జల్సా చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు అటవీ సమస్యకు శాశ్వతంగా చెక్ పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నది. పోడు భూముల సమస్యను రూపుమాపేందుకు ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. ఉమ్మడి జిల్లాలో అధికార యంత్రాంగం అందుకు శరవేగంగా కార్యాచరణ రూపొందిస్తున్నది. పోడు భూముల్లో సాగు లెక్కలు తేల్చడంతో పాటు భవిష్యత్తులో అటవీ భూముల పరిరక్షణే ధ్యేయంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. నవంబర్ 8 నుంచి జిల్లాల్లో పోడు సాగుదారుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఇప్ప టి వరకు అటవీ భూముల ఆక్రమణల లెక్క లు తేల్చిన అధికారులు భవిష్యత్తులో అంగుళం భూ మి కూడా ఆక్రమణకు గురికాకుండా పక్కాగా కార్యాచరణను సిద్ధం చేస్తున్నారు. ప్రత్యేకంగా విజిలెన్సు బృందాలతో పాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని సైతం వినియోగించనున్నారు. నెలరోజులు పోడు సాగుదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నా రు. పంచాయతీల వారీగా ప్రత్యేక కమిటీలు నియమించి ఈ ప్రక్రియ చేపడతారు. కమిటీకి చై ర్మన్, ప్రధాన కార్యదర్శులను నియమించనున్నా రు. రాజకీయాలతో సంబంధం లేకుండా గిరిజనులకే కమిటీల్లో ప్రాతినిధ్యం ఉండేలా చూస్తున్నారు.
కేసీఆర్ హామీతో…
అడవులపై ఆధారపడి జీవించడమే గిరిజనుల జీవనాధారం. అనాదిగా పోడు సాగునే నమ్ముకుని బతుకులు వెళ్లదీస్తున్నారు. వారికి తెలిసిన వృత్తి వ్యవసాయమే. కానీ పోడు భూములపై హక్కు మాత్రం కలగానే మిగిలిపోతూ వస్తోంది. ఏటా పోడు భూముల్లో సాగు చేసేందుకు సిద్ధపడడం, అటవీ శాఖ అధికారులు అడ్డుకోవడం పరిపాటిగా మారింది. దశాబ్దాలుగా సాగు చేస్తున్న భూములపై తమదే హక్కంటూ సాగుదారులు… అనుమతి లేదంటూ, అడుగు పెట్టనీయమంటూ అటవీ శాఖలు బాహాబాహీకి దిగిన ఘటనలు మన వద్ద అనేకం వెలుగు చూశాయి. ఈ క్లిష్టమైన సమస్యకు ముగింపు పలికేందుకు సీఎం కేసీఆర్ సిద్ధమయ్యారు. చిక్కుముడులతో కూడుకున్న పోడు భూమి సమస్యను అర్హులైన వారికి న్యాయం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. అక్రమార్కుల భరతం పడుతూనే… పేద కుటుంబాలకు న్యాయం చేసేందుకు కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు కార్యాచరణను సిద్ధం చేస్తుండడంతో అర్హుల్లో ఆనందం కనిపిస్తున్నది.
కామారెడ్డిలో 26వేలకు పైగా దరఖాస్తులు
కామారెడ్డి, డిసెంబర్ 3 : కామారెడ్డి జిల్లాలో 268 పంచాయతీల పరిధిలో 52,291 ఎకరాల పోడు భూములు ఉన్నట్లు గుర్తించారు. ఇప్పటి వరకు మొత్తం 26,700 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఉపగ్రహ చిత్రాల ద్వారా సర్వే నిర్వహించి డిజిటల్తో పాటు శాటిలైట్ సర్వే ప్రామాణికంగా సమస్యలను పరిష్కరించేందుకు ప్రణాళికలు రూ పొందిస్తున్నారు.పోడు భూములను సాగు చేసుకుంటున్న రైతులను గుర్తించేందుకు ప్రభుత్వం త్వరలోనే మార్గదర్శకాలను జారీ చేయనున్నది. క్షేత్రస్థాయిలో పరిశీలన కోసం గ్రామస్థాయిలో అటవీ, రెవెన్యూ, గిరిజన తదితర శాఖలకు చెందిన అధికారులతో కలిసి సర్వే చేయనున్నారు. 2005, 2006 అక్టోబర్, నవంబర్ నెల లో అటవీశాఖ ఉపగ్రహాల ద్వారా తీసిన అడవుల ఛాయాచిత్రాలను పరిశీలిస్తారు. అటవీ భూములను తొలగించి సాగు చేస్తున్న వారి వివరాలను పరిశీలించనున్నారు. ఈ వివరాలను ఉపగ్రహ సరిపోల్చ డం ద్వారా అర్హులకు న్యాయం చేసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. రెవెన్యూ, సర్వే ల్యాండ్ రికార్డు, అటవీ,గిరిజన సంక్షేమ శాఖ, పంచాయతీ అధికారుల సమక్షంలో పోడు భూముల సర్వే నిర్వహించి గ్రామాల వారీగా నివేదికను తయారు చేసి ప్రభుత్వానికి అందజేయనున్నారు.