తెలంగాణ పల్లె జీవనానికి ఆధారమైన చెరువులు సమైక్య పాలకుల ఏలుబడిలో ధ్వంసమయ్యాయి. పూడిక తీసే వారు లేరు. తెగిన కట్టల్ని మళ్లీ కట్టించినవారు లేరు. వందల ఏండ్ల వైభవం కాస్త వట్టిపోయిన దుస్థితి. తెలంగాణ ఉద్యమంలో టీఆర్ఎస్ వెంట నడిచిన పల్లెలు.. ప్రత్యేక రాష్ట్రంలో చెరువుల పునరుద్ధరణపై ఆశలు పెట్టుకున్నాయి. వాటికి ఓ రూపాన్నిస్తూ.. చెరువులకు పునర్వైభవాన్ని తీసుకొస్తూ సీఎం కేసీఆర్ ‘మిషన్ కాకతీయ’ పథకానికి శ్రీకారం చుట్టారు. 2015 మార్చి 12న సదాశివనగర్ మండల కేంద్రంలోని పాతచెరువులో ప్రతిష్ఠాత్మక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆ తర్వాత యావత్ తెలంగాణకు ఆ పథకం విస్తరించింది. చెరువుల పునరుద్ధరణతో పడావుపడ్డ భూముల్లోకి నీళ్లు మళ్లాయి. పల్లెలు పరివర్తన చెందాయి. ఒకప్పుడు తుమ్మలు మొలిచిన చెరువులు.. ఇప్పుడు మత్తడి దుంకుతున్నాయి. ఎంత జోరువాన పడినా చెరువులు చెక్కు చెదరడం లేదు.
సదాశివనగర్, నవంబర్ 2: రైతాంగానికి ఎంతో మేలు చేకూర్చే మిషన్ కాకతీయ (చెరువుల పునరుద్ధరణ) పథకం ఒక పవిత్ర యజ్ఞం. ఆంధ్రా పాలకుల నిర్లక్ష్యంతో ధ్వంసమైన మన చెరువులను పునరుద్ధరించుకొనేందుకు చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ఉద్యమస్ఫూర్తితో కొనసాగించాలి.
ఆంధ్రా పాలకుల నిర్లక్ష్యంతో తెలంగాణలో చెరువుల విధ్వంసం జరిగింది. అరవై ఏండ్లలో చెరువుల్లో ఏడడుగుల మేర పూడిక చేరింది. చెరువుల పునరుద్ధరణ ఆవశ్యంగా భావించి, వాటి వివరాలను తెప్పించుకొన్న సీఎం కేసీఆర్ మిషన్ కాకతీయకు శ్రీకారం చుట్టారు. తెలంగాణ ఏర్పాటు అనంతరం గ్రామాల్లో ఉన్న చెరువుల పునరుద్ధరణ కోసం సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా మిషన్ కాకతీయ పథకాన్ని అమలు చేస్తూ పైలట్ ప్రాజెక్టుగా కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండల కేంద్రంలోని పాత చెరువును ఎంపిక చేశారు. రూ.కోటీ 24లక్షల నిధులు మంజూరు చేసి 2015లో పనులు ప్రారంభించారు. పాత చెరువు పనులు నడుస్తున్న సమయంలో రాష్ట్రంలోని వివిధ జిల్లాల అధికారులు, నాయకులు, రైతులు పెద్ద సంఖ్యలో పనులను పరిశీలించారు. మిషన్ కాకతీయ పథకం ఎంతో బాగుందని కితాబునిచ్చారు. మా గ్రామాల్లోనూ చెరువు పునరుద్ధరణ పనులు చేస్తే బాగుపడేవారమన్నారు. చెరువులో నల్లమట్టిని రైతులు వ్యవసాయ భూముల్లో పోసుకునేందుకు క్యూ కట్టారు. నల్లమట్టిని ఉచితంగా అందజేయడంతో జిల్లాలోని వివిధ గ్రామాలకు చెందిన రైతులూ తమ ట్రాక్టర్లలో మట్టిని తరలించుకున్నారు. ఐదు పొక్లెయినర్లు, 200 ట్రాక్టర్లు ప్రతి రోజూ చెరువు పూడికతీత పనులు నిర్వహించాయి.
రెండు పంటలకూ నీళ్లు..
పాత చెరువులో ఉన్న పూడికను పూర్తిగా తొలగించడంతో చెరువు కింద ప్రస్తుతం రెండు పంటలు పండుతున్నాయి. మిషన్ కాకతీయ పథకంతో చెరువు కింద భూములు ఉన్న రైతులు సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. పాత చెరువు పనులు పూర్తి కావడంతోపాటు కాలువలు, తూములు, అలుగులు, కట్టలను బాగుచేశారు. పాత చెరువు పనులను మొదటి విడుతలో చేపట్టగా, రెండో విడు త పనులను రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో మంత్రు లు ప్రారంభించారు. మిషన్ కాకతీయ పథకంతో చెరువులన్నీ జలకళను సంతరించుకున్నా యి. ఎల్లప్పు డూ నీటితో నిండి ఉండడంతోపాటు రెండు పంటలూ పండుతుండడంతో కర్షకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
పాత చెరువు రూపురేఖలు మారాయి
సీఎం కేసీఆర్ సదాశివనగర్ పాత చెరువులో పూడికతీత పనులు చేయించడంతో చెరువు రూపురేఖలు మారా యి. చెరువులో ఉన్న నల్లమట్టిని ఉచితంగా అందించడంతో రైతులు సాగు భూముల్లో పోసుకొని మంచి దిగుబడి సాధించారు. ఇంత మంచి పథకాన్ని మా మండలం నుంచే ప్రారంభించడంపై ఇక్కడి ప్రజలంతా సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం.
రైతుల్లో ఆనందం..
సీఎం కేసీఆర్ చెరువులకు పూ ర్వ వైభవం తెచ్చేందుకు మిష న్ కాకతీయ పథకాన్ని ప్రవేశపెట్టి మొదటగా సదాశివనగర్ మండల కేంద్రంలోని పాత చెరువులో పనులు ప్రారంభించడం సంతోషకరం. మిషన్ కాకతీయతో ప్రతీ గ్రామంలోని చెరువుల కింద రెండు పంటలూ పండుతున్నాయి. రైతులు ఎంతో సంతోషంగా ఉన్నారు. అద్భుతమైన పథకాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు.