అక్షయ్‌కుమార్ యాడ్‌ను ట్వీట్ చేసిన నితిన్ గడ్కరీ.. చెలరేగిన వివాదం
Akshay Kumar Ad: కార్లలో భద్రత కోసం ఆరు ఎయిర్‌బ్యాగ్స్ ఉండాలంటూ హీరో అక్షయ్‌కుమార్‌తో ఓ యాడ్‌ను రూపొందించారు. అయితే ఆ వాణిజ్య ప్రకటనను కేంద్ర రోడ్డు రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్‌పై
న్యూఢిల్లీ: కార్లలో భద్రత కోసం ఆరు ఎయిర్‌బ్యాగ్స్ ఉండాలంటూ హీరో అక్షయ్‌కుమార్‌తో ఓ యాడ్‌ను రూపొందించారు. అయితే ఆ వాణిజ్య ప్రకటనను కేంద్ర రోడ్డు రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్‌పై ఇప్పుడు విమర్శలు వస్తున్నాయి. వరకట్నాన్ని ప్రోత్సహిస్తున్నట్లు ఆ యాడ్ ఉందని విపక్ష ఎంపీ ప్రియాంకా చతుర్వేది ఆరోపించారు. ఇంతకీ ఆ యాడ్‌లో ఏముందంటే.. కూతురికి పెళ్లి చేసి ఓ కారులో అత్తారింటికి సాగనంపుతున్న సమయంలో.. పోలీసు దుస్తుల్లో ఉన్న అక్షయ్‌కుమార్ అక్కడికి వస్తాడు. అమ్మాయి తండ్రితో మాట్లాడుతూ.. రెండు ఎయిర్‌బ్యాగ్‌లు మాత్రమే ఉన్న కారులో పంపితే సురక్షితంగా ఉండరని అంటాడు. ఆ తర్వాత సీన్లో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్న కారులో ఆ కొత్త జంట పయనమై వెళ్తుంది. అయితే ఈ యాడ్ వరకట్న వ్యవస్థను ప్రోత్సహిస్తున్నట్లు ఉందని ఆరోపణలు వస్తున్నాయి.
ఇటీవల టాటా సన్స్ మాజీ చైర్మెన్ సైరస్ మిస్త్రీ రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. ఎయిర్‌బ్యాగ్స్ లేకుండా ఉన్న కారులో ప్రయాణించడం వల్ల ఆ ఘటనలో అతను ప్రాణాలు కోల్పోయినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రజల్లో ఎయిర్‌బ్యాగ్స్ గురించి అవగాహన కల్పించేందుకు అక్షయ్‌తో ఓ యాడ్‌ను రూపొందించారు. ఈ యాడ్‌తో భద్రత కోణాన్ని చూపిస్తున్నారా లేక వరకట్న కోణాన్ని ప్రమోట్ చేస్తున్నారా అని చతుర్వేది ప్రశ్నించారు.
This is such a problematic advertisement. Who passes such creatives? Is the government spending money to promote the safety aspect of a car or promoting the evil& criminal act of dowry through this ad? https://t.co/0QxlQcjFNI
— Priyanka Chaturvedi🇮🇳 (@priyankac19) September 11, 2022
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

