హైదరాబాద్, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ): పంట రుణాల కోసం రైతులను ఇబ్బందులకు గురిచేయడం దారుణమని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎల్ నినో ప్రభావంతో నెలకొన్న కరువు పరిస్థితుల్లోనూ రైతులపై కనికరం చూపరా? అని గురువారం ఒక ప్రకటనలో ప్రశ్నించారు.
పాత అప్పును వడ్డీ సహా చెల్లిస్తేనే కొత్త రుణం మంజూరు చేస్తామని బ్యాంకర్లు చెప్పడం ఆక్షేపణీయమని పేర్కొన్నారు. వానకాలం ముగిసినా 61% మంది రైతులకు మాత్రమే రుణాలివ్వడం పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. అర్హులైన రైతులందరికీ సత్వరమే పంట రుణం ఇవ్వాలని డిమాండ్ చేశారు.