గద్వాల, అక్టోబర్ 1 : జూరాల ప్రాజెక్టులో నీటి లభ్యత తక్కువగా ఉండటంతో కాలువలతోపాటు లిఫ్ట్‌లకు గురువారం సాయంత్రం నుంచి నీటి విడుదలను బంద్ చేసినట్టు పీజేపీ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ నాగేశ్వర్రావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కృష్ణానదిలో నీటి లభ్యత తక్కువగా ఉన్న కారణంగా ఉన్నతాధికారుల ఆదేశం మేరకు వారబందీ పద్ధతిలో కాలువలు, పంప్‌హౌస్‌లకు నీటిని విడుదల చేయాలని నిర్ణయించినట్టు పేర్కొన్నారు. ఈ నెల 7న తిరిగి నీటిని విడుదల చేయనున్నట్టు వివరించారు. గత నెల 24న వనపర్తి జిల్లా కేంద్రంలో నిర్వహించిన సాగునీటి సమావేశంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్ నిర్ణయించిన మేరకు వారబందీ పద్ధతిన నీటిని విడుదల చేయనున్నట్టు తెలిపారు.