గద్వాల/అయిజ, అక్టోబర్ 1: జూరాల ప్రాజెక్టుకు గురువారం 500 క్యూసెక్కుల వరద నీరు మాత్రమే వచ్చి చేరింది. దీంతో కోయిల్‌సాగర్ లిఫ్ట్‌కు 630 క్యూసెక్కులు మినహాయిస్తే అన్ని ఎత్తిపోతలకు నీటి విడుదల నిలిపివేశారు. పీజేపీ ఎడమ కాలువకు మాత్రమే 1,140 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. డ్యామ్ పూర్తి స్థాయి సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం ప్రాజెక్టులో 8.571 టీఎంసీలు నిల్వ ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఔట్‌ఫ్లో 1,862 క్యూసెక్కులుగా నమోదైందన్నారు. తుంగభద్ర డ్యామ్‌కు ఇన్‌ఫ్లో లేదు, అవుట్‌ఫ్లో 9,573 క్యూసెక్కులుగా నమోదైంది. డ్యామ్ గరిష్ఠ సామ ర్థ్యం 105.788 టీఎంసీలు కాగా, ప్ర స్తుతం 71.018 టీఎంసీలు ఉన్నాయి.