Swayambhu | హ్యాపీ డేస్, యువత, ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాలతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు టాలీవుడ్ యాక్టర్ నిఖిల్ సిద్దార్థ (Nikhil). కార్తికేయ ప్రాంచైజీతో పాన్ ఇండియా స్థాయిలోమంచి ఫేం సంపాదించాడు. ఈ టాలెంటెడ్ యాక్టర్ కాంపౌండ్ నుంచి వస్తోన్న తాజా చిత్రం స్వయంభు (SWAYAMBHU). ఈ చిత్రానికి భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్నాడు.
Nikhil 20గా నిఖిల్ తొలి పాన్ ఇండియా ప్రాజెక్టుగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మలయాళ భామ సంయుక్తామీనన్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఉత్తేజాన్ని అందించే, జ్ఞానోదయాన్ని కలిగించే నిఖిల్ స్వయంభు ప్రయాణం.. మోస్ట్ ఎక్జయిటింగ్ అనౌన్స్మెంట్ అంటూ మూవీ లవర్స్‌లో ఎక్జయిట్మెంట్ క్రియేట్ చేశారు మేకర్స్. ఈ చిత్రాన్ని ఎప్పుడు విడుదల చేసేది నవంబర్ 24న ఉదయం 11 గంటలకు వీడియో ద్వారా ప్రకటించబోతున్నట్టు తెలియజేస్తూ కొత్త లుక్ రిలీజ్ చేశారు. ఈ లుక్ నెట్టింట వైరల్ అవుతోంది.
ఠాగూర్ మధు సమర్పణలో పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్‌పై భువన్, శ్రీకర్ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నారు. స్వయంభులో నిఖిల్ యుద్ధ వీరుడిగా ఇదివరకెన్నడూ కనిపించని సర్ప్రైజింగ్ లుక్‌లో మెరువబోతున్నట్టు ఇప్పటివరకు షేర్ చేసిన పోస్టర్లు చెబుతున్నాయి. ఈ చిత్రానికి కేజీఎఫ్ ఫేం రవిబస్రూర్ స్వయంభు చిత్రానికి మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తుండటంతో అంచనాలు భారీగానే ఉన్నాయి.
The wait ends.
The rise begins to conquer the box office ❤🔥 ❤️🔥#Swayambhu Release Date Announcement With a Massive Video on NOV 24th at 11 AM 🔥🔥@actor_nikhil @iamsamyuktha_ @NabhaNatesh @krishbharat20 @DOPSenthilKumar @RaviBasrur @TagoreMadhu @bhuvan_sagar… pic.twitter.com/vBgedUCTsT— BA Raju’s Team (@baraju_SuperHit) November 22, 2025
NC 24 | నాగచైతన్య బర్త్ డే స్పెషల్.. మహేశ్ బాబు వారణాసి లుక్‌తో ఎన్సీ 24 క్రేజీ న్యూస్