NHRC | రెవెన్యూ శాక మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంస్థ రాఘవ కన్స్ట్రక్షన్స్పై ఎన్హెచ్ఆర్సీ(NHRC) సీరియస్ అయింది. రాజేంద్రనగర్లోని మానస హిల్స్ అక్రమ మైనింగ్ విషయంలో మంత్రి శ్రీనివాస్ రెడ్డి సంస్థపై జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అనుమతులు లేకుండా అన్ని తవ్వ కాలు ఎలా చేశారు? సామాన్య ప్రజలకు ఓ చట్టం, మంత్రి సంస్థలకు ఓ చట్టం ఉంటుందా? అని సూటిగా ప్రశ్నించింది. దీనిపై ఎంఎండీఆర్ చట్టం కింద చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి సూచింది. రెవెన్యూ, గనుల శాఖ, కాలుష్య నియంత్రణ మండలి, హెచ్ఎండీఏ ఎందుకు మౌనంగా ఉన్నాయి? 8 వారాల్లో చర్యలు తీసుకోవా లని కేంద్ర బొగ్గు గనుల శాఖకు ఆదేశాలు జారీ చేసింది.
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంస్థ రాఘవ కన్స్ట్రక్షన్స్పై NHRC సీరియస్
రాజేంద్రనగర్లో మానస హిల్స్ అక్రమ మైనింగ్ విషయంలో కాంగ్రెస్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంస్థపై ఆగ్రహం వ్యక్తం చేసిన జాతీయ మానవ హక్కుల కమిషన్
అనుమతులు లేకుండా అన్ని తవ్వకాలు ఎలా చేశారు? సామాన్య… https://t.co/ezLlSpAB9c pic.twitter.com/iXtdLcIZ78
— Telugu Scribe (@TeluguScribe) July 31, 2026