హైదరాబాద్, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ) : జాతీయ ఆరోగ్య మిషన్(ఎన్హెచ్ఎం) కింద పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను వెంటనే రెగ్యులర్ చేయాలని ఎన్హెచ్ఎం జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు మహేందర్రావు పుట్ట డిమాండ్ చేశారు.
మంగళవారం హైదరాబాద్లోని ఇందిరాపార్క్ వద్ద ఎన్హెచ్ఎం జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన మహాధర్నాలో ఆయన మాట్లాడుతూ.. ఎన్హెచ్ఎం కింద 78 క్యాడర్లలో 17 వేల కు పైగా కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నట్టు తెలిపారు. 20 ఏండ్లుగా విధులు నిర్వహిస్తున్నా రెగ్యులర్ కాలేదని వాపోయారు.