అమరావతి : ఆంధ్రప్రదేశ్లో కరోనా ఉధృతి కొనసాగుతున్నది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 3797 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 5498 మంది చికిత్సకు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. 35 మంది ప్రాణాలు కోల్పోయారు. ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 18,89,513కు పెరిగింది. ఇప్పటివరకు 18,38,469 మంది కోలుకున్నారు. మరో 38338 యాక్టివ్ కేసులున్నాయి. మొత్తం మరణాలు 12,706కు చేరాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ 97,696 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేసినట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.