పుణె: వన్డే ప్రపంచకప్ 2023(ODI World Cup 2023)లో భాగంగా పుణె వేదికగా జరుగుతున్న సౌత్ఆఫ్రికా( South Africa), న్యూజిలాండ్(New Zealand) మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ప్రొటిస్ బ్యాట్స్‌మెన్ దంచికొట్టారు. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన సౌత్ ఆఫ్రికా నిర్ణీత 50 ఓవరల్లో 4 వికెట్ల నష్టానికి 357 పరుగుల భారీ స్కోర్ చేసింది. సౌత్ ఆఫ్రికా బ్యాటర్లలో ఓపెనర్ క్వింటన్ డికాక్(114, 116 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్‌లు) వాండర్ డసెన్ (133, 118 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్స్‌లు) ఆకాశమే హద్దుగా చెలరేగారు. కాగా, డికాక్ ఈ వరల్డ్ కప్‌లో నాలుగు సెంచరీలు చేయడం విశేషం. వీరితో పాటు డేవిడ్ మిల్లర్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అతను 29 బంతుల్లో 53 అర్థశతకం బాది నీషమ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. న్యూజిలాండ్ బౌలర్లలో సౌథీ రెండు వికెట్లు తీయగా..జిమ్మీ నీషమ్, ట్రెంట్ బౌల్ట్ ఒక్కో వికెట్ పడగొట్టరు.