టీ20 ప్రపంచకప్‌లో సెమీస్‌కు ముందే వెనుదిరిగినా.. న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లలో మాత్రం ఇండియా ఇరగదీసింది. భారత్ టూర్లో భాగంగా న్యూజిలాండ్ ఇప్పటి వరకు భారత్‌తో ఆడిన మూడ్ టీ20 మ్యాచ్‌లను గెలిచి తమ సత్తాను మరోసారి చాటింది.
తాజాగా జరిగిన మూడో టీ20 మ్యాచ్‌ను కూడా టీమిండియా అవలీలగా గెలిచింది. 73 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. 3 మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. న్యూజిలాండ్‌ను 111 పరుగులకే మట్టికరిపించింది. న్యూజిలాండ్‌కు 185 పరుగుల భారీ లక్ష్యాన్ని అందించి.. న్యూజిలాండ్‌ను టఫ్ బౌలింగ్‌తో కట్టడి చేయడంతో భారత్ సఫలం అయింది.
అంతకుముందు టాస్ గెలిచిన భారత్.. బ్యాటింగ్ ఎంచుకుంది. టీమిండియాను కెప్టెన్ రోహిత్ శర్మ ఆదుకున్నాడు. 31 బంతుల్లో 56 పరుగులు చేశాడు. ఆ తర్వాత ఇషాన్ కిషన్ 21 బంతుల్లో 29 పరుగులు చేశాడు. శ్రెయాస్ అయ్యార్ 25, వెంకటేశ్ అయ్యర్ 20, దీపక్ చాహర్ 21, హర్షల్ పటేల్ 18 పరుగులు చేశారు. న్యూజిలాండ్ బౌలర్లలో సాంత్నర్ 3 వికెట్లు తీయగా.. బౌల్ట్, మిల్నే, ఫెర్గుసన్, సోదీ.. తలో వికెట్ తీశారు.
185 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ అనుకున్న విధంగా రాణించలేదు. ఒక్క గప్తిల్ తప్పితే మిగితా ప్లేయర్లు ఎవ్వరూ సరిగ్గా ఆడలేదు. గప్తిల్ 36 బంతుల్లో 51 పరుగులు చేయగా.. టిమ్ సీఫెర్ట్ మాత్రం 17 పరుగులు చేశాడు. ఫెర్గుసన్ 14 పరుగులు చేశాడు. మిగిలిన ప్లేయర్లు అంతా 10 లోపే పరుగులు చేశారు. న్యూజిలాండ్ వికెట్లు కాపాడుకోవడంలో విఫలం అవడంతో 20 ఓవర్లు ముగియకముందే ఆల్ అవుట్ అయిపోయింది. 17.2 ఓవర్లలోనే 111 పరుగులు చేసి ఆల్ అవుట్ అయింది.
భారత బౌలర్లలో అక్షర్ పటేల్ రాణించాడు. 3 ఓవర్లు వేసి కేవలం 9 పరుగులే ఇచ్చి 3 వికెట్లు తీశాడు. చాహర్, యజ్వేంద్ర, వెంకటేశ్ అయ్యర్ తలో వికెట్ తీయగా.. హర్షల్ పటేల్ 2 వికెట్లు తీశాడు.
That's that from the Eden Gardens as #TeamIndia win by 73 runs and clinch the series 3-0.
— BCCI (@BCCI) November 21, 2021
Scorecard – https://t.co/MTGHRx2llF #INDvNZ @Paytm pic.twitter.com/TwN622SPAz
3rd T20I. It's all over! India won by 73 runs https://t.co/MTGHRxjWKf #INDvNZ @Paytm
— BCCI (@BCCI) November 21, 2021