Hunter Road | సౌకర్యవంతమైన సేవల కోసం హంటర్ రోడ్డులో కొత్త బస్ స్టాప్
Hunter Road | ప్రజారవాణా వ్యవస్థను మరింత మెరుగుపరచడంతోపాటు ప్రయాణికులకు సౌకర్యవంతమైన సేవలు అందించేందుకు ఆర్టీసీ నిరంతరం కృషి చేస్తోందన్నారు ఆర్టీసీ హనుమకొండ డిపో మేనేజర్ ధరంసింగ్నాయక్.
Hunter Road | న్యూశాయంపేట, నవంబర్ 4 : విద్యార్థులు, ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడమే ఆర్టీసీ లక్ష్యమని ఆర్టీసీ హనుమకొండ డిపో మేనేజర్ ధరంసింగ్నాయక్ అన్నారు. విద్యార్థుల ప్రయాణ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని వరంగల్ హంటర్‌రోడ్డులోని బొందివాగు సమీపంలో సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం జానపద గిరిజన విజ్ఞాన పీఠం మెయిన్ రోడ్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన బస్‌స్టాప్‌ను ఆయన ప్రారంభించారు. జానపద గిరిజన విజ్ఞానపీఠం పీఠాధిపతి ప్రొఫెసర్ గడ్డం వెంకన్నతో కలిసి బస్ స్టాప్‌ను ప్రారంభించి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకొచ్చారు.
ఈ సందర్భంగా డీఎం ధరంసింగ్నాయక్ మాట్లాడుతూ.. విద్యార్థులు, ప్రజల సౌకర్యార్థం బస్ స్టాప్‌ను ఏర్పాటు చేసినట్లు, నిత్యం విశ్వవిద్యాలయానికి వచ్చే విద్యార్థులు, పరిసర ప్రాంత ప్రజలు బస్సుల కోసం ఇబ్బందులు పడకుండా ఈ బస్ స్టాప్ ఉపయోగపడుతుందన్నారు. ప్రజారవాణా వ్యవస్థను మరింత మెరుగుపరచడంతోపాటు ప్రయాణికులకు సౌకర్యవంతమైన సేవలు అందించేందుకు ఆర్టీసీ నిరంతరం కృషి చేస్తోందన్నారు.
అనంతరం ధరంసింగ్నాయక్ను ప్రొఫెసర్ గడ్డం వెంకన్నకు పూలబోకే అందజేసి శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ కంట్రోలర్ చంద్రయ్య, పీఠం జూనియర్ అసిస్టెంట్ అమేర్ ఆలీఖాన్, అసిస్టెంట్ ప్రోఫెసర్లు డాక్టర్ శ్రీమంతుల దామోదర్, డాక్టర్ బాసని సురేష్, టెక్నికల్ అసిస్టెంట్ డాక్టర్ గంపా సతీష్ , బుక్ బేరర్ సిద్దోజు సునంద, సిబ్బంది అంజనేయులు, ఆశోక్, సులోచన, పరిశోధకులు, విద్యార్థులు, కాలనీవాసులు పాల్గొన్నారు.
Read Also :
Weather Changes | ప్రపంచ దేశాల్లో దుర్భరమవుతున్న వాతావరణ పరిస్థితులు.. అధ్యయనంలో వెల్లడి..
Jairam Ramesh | రాముడి పేరుతో పాపాలు ఇంకెన్నాళ్లు..? బీజేపీపై జైరాం రమేష్ ఆగ్రహం
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ప్రభుత్వ ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దని ఎమ్మెల్యే మందుల సామేల్కి వినతి
Hunter Road | సౌకర్యవంతమైన సేవల కోసం హంటర్ రోడ్డులో కొత్త బస్ స్టాప్
సారపాకలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
Y.S. Sharmila | ఎన్నికల్లో విజయం ప్రజా తీర్పు కాదు..అధికార మదంతో బలవంతపు గెలుపు : వైఎస్ షర్మిల
పెన్షనర్లకు డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్‌పై అవగాహన శిబిరం
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

