Y.S. Sharmila | ఎన్నికల్లో విజయం ప్రజా తీర్పు కాదు..అధికార మదంతో బలవంతపు గెలుపు : వైఎస్ షర్మిల
Y.S. Sharmila | ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కూటమి పాలనపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
అమరావతి : ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (Y.S. Sharmila) కూటమి పాలనపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాల ( Election Results ) పై ట్విటర్ వేదికగా ఆమె ఘాటుగా స్పందించారు. ఎన్నికల్లో ఓట్లు మీరే వేసుకున్నారు. గెలుపు ( Election victory) మీదేనని ప్రకటించుకున్నారు. ఇంకా ప్రజలతో, ప్రజాస్వామ్యంతో పనేంటి ? అని ప్రశ్నించారు.
టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల విజయం ప్రజా తీర్పు కాదని, అధికార మదానికి, రాక్షస తత్వానికి తార్కాణమని విమర్శించారు. కూటమి పార్టీల నిజమైన జయభేరి కాదని, ప్రజల గొంతు నొక్కి, ప్రతిపక్షాలను అణచివేసి, సాధించిన బలవంతపు గెలుపని అన్నారు. ఎన్నికల సంఘాన్ని కూటమి సంఘంగా చేసి, పోలీసు వ్యవస్థను గుప్పిట్లోకి తీసుకుని, ఈ దేశ ఎన్నికల వ్యవస్థకే సరికొత్త నిర్వచనం చెప్పారని దుయ్యబట్టారు. దేశం ముంగిట రాష్ట్రం పరువు తీసినందుకు కూటమి పార్టీలు సిగ్గుపడాలని అన్నారు.
రౌడీలను, గూండాలను పెట్టి బలవంతపు ఏకగ్రీవాలకు పాల్పడ్డాడని ఆరోపించారు. ప్రతిపక్ష అభ్యర్థులను తన్ని తరిమేసి, ఎన్నికలు జరిగిన చోట దౌర్జన్యాలతో బ్యాలెట్ బాక్సులను తమ ఆధినంలోకి తీసుకున్నారని, ఓటు వేయకుండా ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారని ఆరోపించారు. ఓటరు తీర్పును తిరగరాసే ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్య మనుగడకే గొడ్డలిపెట్టని, వ్యవస్థల విధ్వంసానికి పరాకాష్ట అని పేర్కొన్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Y.S. Sharmila | ఎన్నికల్లో విజయం ప్రజా తీర్పు కాదు..అధికార మదంతో బలవంతపు గెలుపు : వైఎస్ షర్మిల
పెన్షనర్లకు డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్‌పై అవగాహన శిబిరం
AP News | ఏపీలో గెలిచిన మేయర్లు, చైర్పర్సన్ల ప్రమాణ స్వీకారం ఎప్పుడంటే ?
Jairam Ramesh | రాముడి పేరుతో పాపాలు ఇంకెన్నాళ్లు..? బీజేపీపై జైరాం రమేష్ ఆగ్రహం
Talasani Srinivas Yadav | ఆర్జేడీ నేత తేజస్విప్రసాద్ యాదవ్, ఎస్పీ నేతలకు తలసాని స్వాగతం.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

