పెన్షనర్లకు డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్‌పై అవగాహన శిబిరం
కోల్ మైన్స్ ప్రావిడెంట్ ఫండ్ (సీఎంపీఎఫ్) సంస్థ ఆధ్వర్యంలో డిజిటల్ లైఫ్ సర్టిఫికేషన్ క్యాంపెయిన్ 5.0లో భాగంగా నవంబర్ 5, 6 తేదీల్లో కొత్తగూడెం ఏరియా సింగరేణి సంస్థ సహకారంతో రుద్రంపూర్‌లోని సీఈఆర్ క్లబ్లో ప్రత్యేక అవగాహన శిబిరాన్ని...
– నవంబర్ 5, 6 తేదీల్లో రుద్రంపూర్ సీఈఆర్ క్లబ్లో క్యాంపెయిన్ 5.0
రుద్రంపూర్, నవంబర్ 04 : కోల్ మైన్స్ ప్రావిడెంట్ ఫండ్ (సీఎంపీఎఫ్) సంస్థ ఆధ్వర్యంలో డిజిటల్ లైఫ్ సర్టిఫికేషన్ క్యాంపెయిన్ 5.0లో భాగంగా నవంబర్ 5, 6 తేదీల్లో కొత్తగూడెం ఏరియా సింగరేణి సంస్థ సహకారంతో రుద్రంపూర్‌లోని సీఈఆర్ క్లబ్లో ప్రత్యేక అవగాహన శిబిరాన్ని నిర్వహించనున్నట్లు కొత్తగూడెం సీఎంపీఎఫ్ రీజినల్ కమిషనర్ బుధవరాం ఒక ప్రకటనలో తెలిపారు.
ఇంటివద్ద నుంచే లైఫ్ సర్టిఫికెట్ సమర్పించే విధానంపై అవగాహన
పెన్షనర్లు ఇకపై కార్యాలయాలకు వెళ్లే అవసరం లేకుండా తమ స్మార్ట్‌ఫోన్ ద్వారా ఇంటివద్ద నుంచే జీవన్ ప్రమాణ్ యాప్‌ను ఉపయోగించి డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ సమర్పించుకునే విధానంపై అవగాహన కల్పించడం ఈ క్యాంపెయిన్ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఇప్పటివరకు జీవన్ ప్రమాణ్ ద్వారా లైఫ్ సర్టిఫికెట్ సమర్పించని పెన్షనర్లు సైతం ఈ శిబిరంలో ఉచితంగా తమ డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ సమర్పించుకోవచ్చని పేర్కొన్నారు.
కావాల్సిన ధ్రువ పత్రాలు
1. ఆధార్ కార్డు (ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్ అందుబాటులో ఉండాలి
2. పెన్షన్ పేమెంట్ ఆర్డర్ (PPO) నంబర్
3. సీఎంపీఎఫ్ అకౌంట్/క్లెయిమ్ నంబర్
4. పెన్షన్ జమ అయ్యే బ్యాంకు ఖాతా పాస్‌బుక్
మొబైల్లోనే యాప్ ఏర్పాటు.. శిక్షణ
అవసరమైన పత్రాలతో శిబిరానికి వచ్చిన పెన్షనర్ల మొబైల్ ఫోన్లలో జీవన్ ప్రమాణ్ యాప్‌ను ఇన్స్టాల్ చేయించి, దాని వినియోగ విధానాన్ని ప్రత్యక్షంగా వివరించనున్నట్లు తెలిపారు. భవిష్యత్‌లో ప్రతి నవంబర్‌లో తమ ఇంటివద్ద నుంచే డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్‌ను ఎలా సమర్పించుకోవాలో శిక్షణ అందిస్తామని పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం నవంబర్‌లో పెన్షనర్లు తమ లైఫ్ సర్టిఫికెట్‌ను తప్పనిసరిగా సమర్పించడం ద్వారా పెన్షన్ చెల్లింపుల్లో ఎలాంటి అంతరాయం లేకుండా ప్రతినెలా పెన్షన్‌ను తమ బ్యాంకు ఖాతాల్లో పొందవచ్చని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పెన్షనర్లు అధిక సంఖ్యలో శిబిరానికి హాజరై డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ విధానంపై అవగాహన పెంపొందించుకోవాలని సీఎంపీఎఫ్ రీజినల్ కమిషనర్ కోరారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పెన్షనర్లకు డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్‌పై అవగాహన శిబిరం
AP News | ఏపీలో గెలిచిన మేయర్లు, చైర్పర్సన్ల ప్రమాణ స్వీకారం ఎప్పుడంటే ?
Jairam Ramesh | రాముడి పేరుతో పాపాలు ఇంకెన్నాళ్లు..? బీజేపీపై జైరాం రమేష్ ఆగ్రహం
Talasani Srinivas Yadav | ఆర్జేడీ నేత తేజస్విప్రసాద్ యాదవ్, ఎస్పీ నేతలకు తలసాని స్వాగతం.. వీడియో
cop caught in woman’s home | అర్ధరాత్రి వేళ మహిళ ఇంట్లో పోలీస్ అధికారి.. చుట్టుముట్టిన గ్రామస్తులపై కాల్పులు, ఒకరు మృతి
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

