Dil Raju | తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో వర్కర్స్ ఫెడరేషన్‌కు చెందిన 24 కార్మిక సంఘాలు వేతనాల పెంపు కోసం సినిమా షూటింగ్‌లను నిలిపివేసి బంద్ కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ విషయమై ఫిల్మ్ ఫెడరేషన్ ప్రతినిధులు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో సమావేశం అయ్యారు. షూటింగ్స్ బంద్ చేయడం సరికాదని ఈ సందర్భంగా మంత్రి కోమటి రెడ్డి కార్మికులకు సూచించారు. పనిచేస్తూనే డిమాండ్లు నెరవేర్చుకోవాలన్నారు.
తాజాగా సినీ కార్మికుల వేతన పెంపు విషయంపై నిర్మాతలు, ఫెడరేషన్ నాయకుల మధ్య చర్చలు ముగిశాయి. అయితే ఈ చర్చలు విఫలమైనట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు మాట్లాడుతూ.. సినీ కార్మికుల వేతనాల అంశం ఇంకా కొలిక్కి రాలేదన్నారు. మరో రెండు మూడు సార్లు ఈ అంశంపై చర్చలు జరగాల్సి ఉందన్నారు. ఆ తర్వాత సమస్య పరిష్కారమయ్యే అవకాశమున్నట్టు చెప్పారు.
సమ్మె కొనసాగినా పర్వాలేదన్న నిర్మాతలు చర్చల మధ్యలోనే వెళ్లిపోయినట్టు సమాచారం. నాలుగు వర్కింగ్ కండిషన్స్‌పై ఏకాభిప్రాయంతో ఫెడరేషన్ చర్చలకు రావాలని నిర్మాతలు సూచించినట్టు తెలుస్తోంది.
కార్మికుల బంద్ నేపథ్యంలో ఇప్పటికే మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో దిల్ రాజు భేటీ కూడా అయ్యారు. కార్మికులు అంతకుముంద హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో కమిషనర్ ఆఫీసుకు కూడా వెళ్లారు. మరోవైపు సినీ కార్మికుల వేతనాల పెంపు విషయంపై నిర్మాతలు చిరంజీవితో సమావేశమై చర్చలు కూడా జరిపారని తెలిసిందే.
Manchu Lakshmi | బెట్టింగ్ యాప్ కేసు.. ముగిసిన మంచు లక్ష్మి ఈడీ విచారణ
Jalsa 4k | పవన్ కల్యాణ్ బర్త్‌డే స్పెషల్.. మరోసారి థియేటర్లలో ‘జల్సా’