కొత్తగూడెం క్రైం, నవంబర్ 17: ఏడు రోజులుగా తమ చెరలో ఉన్న సబ్ ఇంజినీర్‌ను మావోయిస్టులు ఎట్టకేలకు విడుదలచేశారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలోని మాన్‌కేళి రహదారి పనులు చేపడుతున్న పీఎంజీఎస్‌వై సబ్‌ఇంజినీర్ అజయ్లక్రాతోపాటు అటెండర్ లక్ష్మణ్‌ను వారం క్రితం మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. మరునాడే అటెండర్‌ను విడుదల చేశారు. అజయ్‌ను విడుదల చేయాలని ఆయన భార్య అర్పిత తన రెండేండ్ల కూతురితో కలిసి మీడియా ప్రతినిధుల సహకారంతో అడవిలో పోరాటం చేసింది. అర్పిత విజ్ఞప్తికి స్పందించిన మావోయిస్టులు బుధవారం ప్రజాకోర్టు నిర్వహించి అజయ్ లక్రాను సురక్షితంగా విడుదల చేశారు.