ZIM vs OMA : పొట్టి ప్రపంచకప్ జింబాబ్వే తొలి అడుగు ఘనంగా వేసింది. కొలంబోలోని సిన్హలీస్ స్పోర్ట్స్ క్లబ్లో ఆల్‌రౌండ్ షోతో అదరగొడుతూ.. ఒమన్‌పై 8 వికెట్లతో గెలుపొందింది. తొలుత బ్లెస్సింగ్ ముజరబని(3-16), బ్రాడ్ ఎవాన్స్(3-18), రిచర్డ్ ఎగర్వ(3-17)లు వికెట్ల వేటతో 103కే ప్రత్యర్థిని పడగొట్టిన జింబాబ్వే.. స్వల్ప లక్ష్యాన్ని ఆడుతూపాడుతూ ఛేదించింది. ఓపెనర్ బ్రియాన్ బెన్నెట్(48 నాటౌట్), బ్రెండన్ టేలర్(31 రిటైర్డ్ హర్ట్) మెరుపులతో 13.3 ఓవర్లోనే మ్యాచ్‌ను ముగించింది.
గ్రూప్ బీలోని జింబాబ్వే లీగ్ దశ తొలిపోరులో పంజా విసిరింది. పసికూన ఒమన్ జట్టును వణికిస్తూ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బంతితో, ఆపై బ్యాటుతో రఫ్ఫాడించిన జింబాబ్వే.. 13.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని అందుకుంది. బ్యాటర్లు విఫలమవ్వగా.. ఒమన్ బౌలర్లు సైతం తేలిపోయారు. ఓపెనర్ బ్రియాన్ బెన్నెట్(48 నాటౌట్) ధనాధన్ ఆటతో విరుచుకుపడగా.. లక్ష్యం కరుగుతూ పోయింది.
Briant Bennett’s 48* sees the chase through to give Zimbabwe a thumping win 👊 https://t.co/0WTMlsv6mP pic.twitter.com/OFcbnOiguC
— ESPNcricinfo (@ESPNcricinfo) February 9, 2026
ఓపెనర్ తడివనషే మరుమని(21)ను ఔట్ చేసిన సూఫియన్ తొలి వికెట్ అందించాడు. డియాన్ మేయర్స్(0) డకౌట్ కాగా.. సీనియర్ ప్లేయర్ బ్రెండన్ టేలర్(31 రిటైర్డ్ హర్ట్) తోడుగా బెన్నెట్ చెలరేగాడు. చిన్న లక్ష్యాన్ని మరో 39 బంతులుండగానే ఉఫ్మనిపించిన జింబాబ్వే రెండు పాయింట్లతో పాటు మెరుగైన రన్‌రేటు(+2.702) సాధించింది. ఆరంభంలోనే ఒమన్‌ను దెబ్బకొట్టి.. జట్టు విజయంలో కీలకమైన ముజరబని ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.
కొలంబోలో బ్లెస్సింగ్ ముజరబని(3-16), రిచర్డ్ నగవర(3-17)లు టాపార్డర్‌ను పడగొట్టగా ఒమన్ ఆటగాళ్లు క్రీజులో నిలిచేందుకు అపసోపాలు పడ్డారు. .. డెత్ ఓవర్లలో బ్రాడ్ ఎవాన్స్(3-18) రెచ్చిపోయాడు. శుభారంభం లభించకపోయినా.. సూఫియన్ మొహమూద్(25), వినాకయక్ శుక్లా(28)లు పట్టుదలతో ఆడి పరువు కాపాడారు. ఆఖర్లో నదీమ్ ఖాన్(20) బ్యాట్ ఝులిపించాడు. కానీ, ఎవాన్స్ ఓవర్లో షకీల్ అహ్మద్ బౌల్డ్ కావడంతో 103కే ఒమన్ ఆలౌటయ్యింది. ప్రపంచకప్‌లో జింబాబ్వేపై ఏ జట్టుకైనా ఇదే అత్యల్ప స్కోర్.