నారాయణపేట, అక్టోబర్ 31 : సర్దార్ వల్లాభాయ్ పటే ల్ ఆశయ సాధనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని అదనపు ఎస్పీ(డీఏఆర్) భరత్ అన్నారు. ఆదివారం పటేల్ జయం తి సందర్భంగా పట్టణంలోని ఎస్పీ కార్యాలయంలో ఆయ న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి రాష్ట్రీయ ఏక్తాదివస్ ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ పోరాటమే ఊపిరిగా ప్రస్థానం కొనసాగిందన్నారు. దేశ సమగ్రత కోసం శ్రమించిన దీరుడు పటేల్ అని తెలిపారు. కార్యక్రమంలో రిజర్వ్ ఇన్స్పెక్టర్ కృష్ణ, ఏఆర్ఎస్ఐ గిరి, ఏఆర్ సిబ్బంది, స్పెషల్ పార్టీ పోలీసులు తదిత రులు పాల్గొన్నారు.
ఉక్కుమనిషి పటేల్
మరికల్, అక్టోబర్ 31 : భారత మొదటి హోం శాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని మరికల్ పటేల్ రోడ్డులో యువకులు నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సం దర్భంగా యువకులు మాట్లాడుతూ చిన్నచి న్న రాజ్యాలను దేశంలో విలీనం చేసిన ఘన త ఉక్కుమనిషి పటేల్‌కే దక్కిందన్నారు. కా ర్యక్రమంలో సతీశ్, మొగులయ్య, రవికిర ణ్, అంజి, శ్రీ కాంత్‌రెడ్డి, భీంరాజ్, శేఖర్, ఎల్లప్ప, ఏ శేఖర్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ కార్యాలయంలో…
నారాయణపేట టౌన్, అక్టోబర్ 31 : పట్టణంలోని కలెక్టర్ కార్యాలయం లో సర్దార్ వల్లాభాయ్ పటేల్ జయంతిని నిర్వహించారు. అధికారులు ఆ యన చిత్రపటానికి పూలమాల వేసి ని వాళులర్పించారు. అనంతరం రాష్ట్రీయ ఏక్తాదివస్ ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమం లో కలెక్టరేట్ ఏవో నర్సింగరావు, బీసీ సంక్షేమశాఖ అధికారి కృష్ణమాచారి, ఆర్డీవో కార్యాలయ ఏవో షర్పొద్దీన్, కా ర్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
పటేల్ గొప్ప వీరుడు
మక్తల్ టౌన్, అక్టోబర్ 31 : దేశంలో సంస్థానాలను విలీ నం చేసిన గొప్ప వీరుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ అని టగ్ ఆఫ్ వార్ జిల్లా అధ్యక్షుడు గోపాలం అన్నారు. పట్టణంలో ని మినీ స్టేడియంలో పటేల్ జయంతి సందర్భంగా టగ్ ఆఫ్ వార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఐక్యతా పరుగు ప్రా రంభించారు. 30 మంది విద్యార్థులు పట్టణంలోని పురవీధుల గుండా పరుగు నిర్వహించారు. అనంతరం మక్తల్ అంబేద్కర్ చౌరస్తాలో గోపాలం మాట్లాడుతూ పటేల్ విదే శి వస్తువులను బహిష్కరించిన గొప్ప దేశ భక్తుడు అని, దేశ అభివృద్ధికి కృషి చేశారన్నారు. విద్యార్థులు ప్రతిజ్ఞ చేసి పటేల్‌కు నివాళులర్పించారు. కార్యక్రమంలో గౌరవ అధ్యక్షుడు రఘు ప్రసన్న, కార్యదర్శులు అంబ్రేశ్, దామోదర్, రూప, శ్రీనివాసులు, కృష్ణమూర్తి, కోశాధికారి అబ్దుల్, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.