నారాయణపేట టౌన్, నవంబర్ 6 : ఓటరు జాబితా పారదర్శకంగా ఉండేందుకు రాజకీయ పార్టీలు ప్రతి పోలిం గ్ బూత్‌కు ఒక బూత్ లెవల్ అసిస్టెంట్‌ను నియమించుకోవాలని ఎన్నికల ఓటరు జాబితా పరిశీలకుడు చంపాలాల్ అన్నారు. శనివారం పట్టణంలోని కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అఖిలపక్ష పార్టీ సమావేశానికి హాజరయ్యా రు. ఈ సందర్భంగా ఆయన మాటాడుతూ ఎన్నికల సం ఘం ప్రతి ఏడాది స్పెషల్ సమ్మరీ రివిజన్‌ను నిర్వహిస్తుందని పేర్కొన్నారు. ఎన్నికలకు ఒకటి రెండు రోజు ముందు జాబితాలో పేర్లు గల్లంతయ్యాయని, మరిణించిన, స్థానికేతరుల పేర్లు జాబితాలో ఉన్నాయని ఫిర్యాదులు వస్తుంటాయన్నారు. అప్పటికే ఎన్నికల పోర్టల్‌లో జాబితా ఉండడం తో ఏమి చేయలేని పరిస్థితి నెలకొంటుందన్నారు. అందువలన స్పెషల్ సమ్మరీ రివిజన్‌ను అన్ని రాజకీయ పార్టీలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. బీఎల్వోలు, బీఎల్ఏ లు సమన్వయంతో పని చేసి ఓటరు జాబితాను తప్పులు లేకుండా సిద్ధం చేసుకోవాలన్నారు. బూత్ లెవల్ అధికారులకు మరోసారి శిక్షణ అందించి ఏ దరఖాస్తు ఎందుకు ఉపయోగపడుతున్నది, క్షేత్రస్థాయిలో వాటిని ఎలా పరిష్కరించాలి అంశాలపై అవగాహన కల్పించాలన్నారు.
కలెక్టర్ హరిచందన మాట్లాడుతూ ముసాయిదా జాబితాను ముద్రించి అన్ని పోలింగ్ బూత్‌ల్లో ఉంచడమే కా కుండా రెండు రోజుల పాటు బీఎల్వోలు పీఎస్‌లోనే కూ ర్చొని ఫిర్యాదులు, దరఖాస్తులు స్వీకరించే విధంగా ఆదేశా లు జారీ చేసినట్లు తెలిపారు. బీఎల్వోలకు మరోసారి శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, రాజకీయ పార్టీలతో సమన్వ యం చేసుకొని జాబితాను సిద్ధం చేస్తామన్నా రు. రాజకీయ పార్టీలు, ప్రజలు ఎలాంటి సం దేహాలు ఉన్నా 915428910 నంబర్‌కు మె సేజ్ ద్వారా తెలియజేయాలని, అంతేకాకుం డా కలెక్టరేట్లోని టోల్‌ఫ్రీ నంబర్ 08506 282282, 9154283906 కు ఫోన్ చేసి సందేహాలు నివృత్తి చేసుకోవచ్చన్నారు. సమావేశంలో ఆర్డీవో వెంకటేశ్వర్లు, ఏవో నర్సింగరావు, రాణి, వివిధ రాజకీయ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
సద్వినియోగం చేసుకోవాలి
ఊట్కూర్, నవంబర్ 6 : ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎన్నికల ఓటరు జాబితా పరిశీలకుడు చంపాలాల్, కలెక్టర్ హరిచందన ప్రజలకు సూచించారు. శనివారం మండలంలోని తిప్రాస్‌పల్లి, పగిడిమర్రి గ్రామాలను అధికారులు సందర్శించి పోలింగ్ బూత్‌లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శనివారం, ఆదివారం నిర్వహించే ఓటరు నమోదు కార్యక్రమంపై విస్తృత ప్రచారం నిర్వహించాలని, బీఎల్వోలు, బీఎల్వోలు సమన్వయంతో తప్పులు లేని ఓటరు జాబితాను సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. ఆయా గ్రా మాల్లో అందిన దరఖాస్తులను అధికారులు పరిశీలించి త గు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఆర్డీవో వెంకటేశ్వర్లు, తాసిల్దార్ తిరుపతయ్య, సర్పంచులు సుమంగళ, సులోచన, బీఎల్వోలు పాల్గొన్నారు.
జాబితాను విజయవంతం చేయాలి
మరికల్, నవంబర్ 6 : ఓటరు నమోదు ప్రక్రియను బూత్ లెవల్ అధికారులు విజయవంతం చేయాలని ఎన్నికల పరిశీలకుడు చంపాలాల్ బీఎల్వోలకు సూచించారు. ఈనెల 6, 7, 27, 28వ తేదీల్లో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నందున 18 ఏండ్లు నిండిన ప్రతిఒక్కరూ తమ పేర్లను ఓటరు జాబితల్లో చేర్చుకోవాలని సూచించారు. శనివారం మండలకేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ఓటర్ల నమోదు కేంద్రా న్ని పరిశీలించారు. కార్యక్రమ ంలో తాసిల్దార్ శ్రీధర్, ఆర్ఐ సుభాష్‌రెడ్డి పాల్గొన్నారు.
తప్పులు లేని జాబితాను తయరు చేద్దాం
ధన్వాడ, నవంబర్ 6 : త ప్పులు లేని ఓటరు జాబితాను తయరు చేద్దామని ఎన్నికల పరిశీలకుడు చంపాలాల్ అ న్నారు. శనివారం మండలకేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో పోలింగ్ బూత్‌లో కొత్త ఓటరు నమోదును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు రోజులపాటు కార్యక్రమం కొ నసాగుతున్నదని, విషయం ప్రజలకు తెలియజేసి 18 ఏం డ్లు నిండిన వారికి ఓటుగా నమోదు చేసుకునేందుకు దరఖాస్తులు స్వీకరించాలని పేర్కొన్నారు. ఓటరు జాబితా ప్ర త్యేక సవరణ కార్యక్రమంపై ప్రజలకు పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని సూచించారు. అదేవిధంగా కంసాన్పల్లి కొనసాగుతున్న ఓటరు నమోదు కార్యక్రమాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో తాసిల్దార్ బాల్‌చందర్, ఆర్ఐ శ్రీనివాసులు పాల్గొ న్నారు.
ప్రతిఒక్కరూ నమోదు చేసుకోవాలి
మక్తల్ రూరల్, నవంబర్ 6 : 18 ఏండ్లు నిండిన ప్రతిఒక్కరూ ఓటరు జాబితాలో తమ పేర్లను నమోదు చేసుకోవాలని రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీశైలం అన్నారు. శనివారం మండలంలోని జక్లేర్, కాచ్వార్, టేకులపల్లి, గోలపల్లి తదితర గ్రామాల్లో ఓటర్ల నమోదుపై ప్రజలకు అవగాహన క ల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల కమిషనర్ ఆదేశాల మేరకు ప్రత్యేకంగా ఓటర్ల జా బితాలో పేర్లను నమోదు చేసుకోవడానికి అవకాశం కల్పిం చారని పేర్కొన్నారు. కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.