e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, December 9, 2021
Home News సమీకృత వ్యాపార సముదాయం ఏర్పాటు చేస్తాం

సమీకృత వ్యాపార సముదాయం ఏర్పాటు చేస్తాం

  • ఐటీ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జయేశ్‌రంజన్‌

నారాయణపేట, అక్టోబర్‌ 21: పేట జిల్లా కేంద్రంలో బంగా రు వ్యాపారుల కోసం త్వరలో సమీకృత వ్యాపార సముదాయం ఏర్పాటుకు చర్యలు చేపట్టనున్నట్లు రాష్ట్ర ఐటీ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జయేశ్‌రంజన్‌ అన్నారు. గురువారం కలెక్టర్‌ కార్యాలయంలో ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మె ల్యే ఎస్‌.రాజేందర్‌రెడ్డి, కలెక్టర్‌ హరిచందనలతో కలిసి బంగారు వ్యాపారస్తులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేట జిల్లాకు బంగారు వ్యాపారంలో మంచి పేరు ఉందని, ఇక్కడి వ్యాపారులకు ఒకేచోట బంగారు అభరణాల షోరూమ్‌, వాటిని తయారు చేసేందుకు అధునాతన యంత్రాలు, కారగిరి పని చేసే వారు ఉండేందుకు వసతితో కూడిన గోల్డ్‌సోక్‌ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. బంగారు వ్యాపారాన్ని మరింత అభివృద్ధ్ది చేసేందుకు ఎమ్మెల్యే ఎస్‌.రాజేందర్‌రెడ్డి మంత్రి కేటీఆర్‌ దగ్గరికి ప్రతిపాదనలు తీసుకొచ్చారని, ఆయన అభ్యర్థన మేరకు బంగారు వ్యాపారస్తుల సమస్యలు తెలుసుకొని ఎలాంటి సదుపాయాలు కల్పించాలనే విషయాలు తెలుసుకునేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేశామన్నారు. కామన్‌ ఫెసిలిటీ సెంటర్‌లో ఆధునిక యంత్రాలు ఏర్పాటు చేయడమే కాకుండా వాటిని ఎలా ఉపయోగించాలనే విషయాలపై నైపుణ్య శిక్షణ ఇస్తామన్నారు. దీంతో మేలిరకం బంగారు నగలు తయారు చేయడంతో పాటు కళాత్మకమైన అభరణాలు తయారు చేసి దేశీయ, అంతర్జాతీయ మార్కెట్‌లో పోటీదారులుగా నిలిచేందుకు అవకాశం ఏర్పడుతుందన్నారు. మౌలిక సౌకర్యాల కల్పనకు అనుభవజ్ఞులైన ఆర్కిటెక్చర్‌లను పంపడంతో పాటు దుబాయ్‌ గోల్డ్‌, కేరళలోని మలబార్‌ గోల్డ్‌ లాంటి సంస్థలను అధ్యయనం చేసి ఇక్కడి వ్యాపారస్తులకు సూచనల మేరకు గోల్డ్‌ వ్యాపార సముదా యం ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.
ఎమ్మెల్యే ఎస్‌.రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ పేట జిల్లాలో ఇప్పటికే రూ.10కోట్ల అంచనా వ్యయంతో వీవింగ్‌ సెంటర్‌ మంజూరు చేసుకోవడం జరిగిందని, బంగారు వ్యాపారస్తుల కోసం గోల్డ్‌ సోక్‌ సెంటర్‌ ఏర్పాటు కోసం 3 ఎకరాల స్థలం ఇవ్వడం జరుగుతుందన్నారు. ఆధునాతన యంత్రా లు, స్కిల్‌ డెవలప్‌ మెంట్‌, భవన నిర్మాణం ప్రభు త్వం ద్వారా ఏర్పాటు చేసేలా చర్య లు తీసుకోవాలని ప్రిన్సిపల్‌ సెక్రటరీని కోరారు. ఇక్కడి బంగారు వ్యాపారస్తులకు నైపుణ్య శిక్షణ అందిస్తే మరింత అభివృద్ధి చెంది దేశంలోనే మంచి పేరు తెచ్చుకునేందుకు అవకాశం ఏర్పడు తుందన్నారు.
ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఇతర రంగాలతో పాటు వ్యవసాయరంగం అభివృద్ధి చెందిందని, ప్రజలు బంగారు నగలు కొనేందుకు ఆసక్తి కనబరుస్తున్నా అందుకు తగ్గ సైప్లె చేయలేకపోతున్నారని తెలిపారు. గోల్డ్‌సోక్‌ వలన పేటకు దేశంలోనే మంచి పేరు వస్తుందని పేర్కొన్నారు.
కలెక్టర్‌ హరిచందన మాట్లాడుతూ జిల్లాలోని బంగారు వ్యాపారస్తులకు మౌలిక వసతులు కల్పించి, నైపుణ్య శిక్షణ అందిస్తే దేశ విదేశాలలో డిమాండ్‌ ఉండేలా కళాత్మక అభరాణాలు తయారు చేసే సత్తా ఇక్కడి వ్యాపారులకు ఉందన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ చంద్రరెడ్డి, మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ హరినారాయణ భట్టడ్‌, బంగారు వ్యాపారస్తులు పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement