తుంగతుర్తి, సెప్టెంబర్ 08 : తుంగతుర్తి విద్యుత్ శాఖ ఏడీఈగా బానోతు నరసింహ మంగళవారం విద్యుత్ శాఖ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పని చేస్తున్న ఏడీఈ వనజ మునగాలకు బదిలీ కాగా, కోదాడలో పనిచేసే నరసింహ పదోన్నతిపై తుంగతుర్తికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు, ప్రజలకు మెరుగైన విద్యుత్ సేవలు అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు. కార్యాలయంలో ఏఈలు పుష్పగుచ్చం అందించి నరసింహకు స్వాగతం పలికారు.