David Wiese : నమీబియా స్టార్ ఆటగాడు డేవిడ్ వీస్(David Wiese) అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. టీ20 వరల్డ్ కప్ చివరి లీగ్ మ్యాచ్‌లో ఇంగ్లండ్(England)పై ఓటమి అనంతరం వీస్ రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆట నుంచి వైదొలిగేందుకు ఇంతకంటే మంచి సమయం ఉండదని ఈ సందర్భంగా ఈ పొడగరి ఆల్‌రౌండర్ అన్నాడు. నమీబియా క్రికెట్లో పెద్దన్నగా పేరొందిన వీస్ వరల్డ్ కప్ టోర్నీతో తన 11 ఏండ్ల సుదీర్ఘ కెరీర్‌కు ముగింపు పలకడం విశేషం.
‘టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీకి ఇంకా రెండేండ్లు ఉంది. ఇప్పుడు నాకు 39 ఏండ్లు. వయసురీత్యా చూసుకుంటే.. మరికొన్నాళ్లు అంతర్జాతీయ క్రికెట్ ఆడగలనని నేను అనుకోవడం లేదు. నమీబియాతో ప్రత్యేకంగా సాగిన కెరీర్‌ను ముగించేందుకు ఇంతకంటే మంచి ప్రదేశం దొరకదనిపించింది. జట్టు సభ్యులతో నేను ఎన్నో మధుర క్షణాలు గడిపాను. వరల్డ్ కప్ టోర్నీలో.. అది కూడా వరల్డ్ క్లాస్ జట్టు అయిన ఇంగ్లండ్‌పై నా చివరి మ్యాచ్ ఆడేశాను. వీడ్కోలుకు ఇదే సరైన సమయం అని భావించాను’ అని వీస్ మీడియా సమావేశంలో తెలిపాడు.
శనివారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో నమీబియా ఓటమి పాలైంది. 10 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ బౌలర్ల ధాటికి 88 రన్స్ చేసిందంతే. కెరీర్ చివరి మ్యాచ్‌లో వీస్ 27పరుగులతో రాణించాడు. దాంతో, ఇంగ్లండ్ 41 పరుగులతో గెలుపొంది సూపర్ 8కు చేరుకుంది.
Stylish and classy 🤩
Harry Brook is awarded the @Aramco POTM for his stunning 47* against Namibia 👏#T20WorldCup | #NAMvENG | 📝: https://t.co/QHupV9Efv9 pic.twitter.com/hbfp4kCB5u
— ICC (@ICC) June 15, 2024
ఇంటర్నేషనల్ క్రికెట్లో వీస్ అరుదైన రికార్డు నెలకొల్పాడు. టీ20 వరల్డ్ కప్‌లో రెండు దేశాల తరఫున ఆడిన క్రికెటర్‌గా గుర్తింపు సాధించాడు. 2013లో దక్షిణాఫ్రికా జెర్సీతో టీ20, వన్డేలు ఆడిన వీస్.. 2016లో పొట్టి వరల్డ్ కప్ ఆడిన సఫారీ జట్టులో సభ్యుడు. ఆ తర్వాత దక్షిణాఫ్రికాతో తెగతెంపులు చేసుకున్న ఈ ఆల్‌రౌండర్ నమీబియాకు మారాడు. 2021లో నమీబియా సూపర్ 12కు క్వాలిఫై కావడంలో వీస్ కీలక పాత్ర పోషించాడు. వీస్ ఇప్పటివరకూ 15 వన్డేలు, 40 టీ20లు ఆడాడు.