అచ్చంపేట, ఫిబ్రవరి 19 : నల్లమలలో కార్చిచ్చు రాజుకున్నది. నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం తాటిగుండాల, బ్రహ్మగిరి సెక్షన్ పరిధిలోని మూడు ప్రాంతాల్లో 30 హెక్టార్లలో నిప్పు రాజుకున్నది. ఎండల తీవ్రతతో పొడిగడ్డి వేగంగా రాళ్లకు రాజుకొని మంటలు వ్యాపించాయి.
బుధవారం ప్రారంభమైన మంటలను అటవీ శాఖ ఫైర్ వాచర్లు, బేస్ క్యాంప్ సిబ్బంది రాత్రి వరకు అతికష్టం మీద ఆర్పారు. గురువారం ఉదయం మళ్లీ వ్యాపించడంతో బ్రహ్మగిరి రేంజ్ అధికారి గురుప్రసాద్ ఆధ్వర్యంలో సిబ్బంది చేరుకొని ఫైర్ లోయర్ల ద్వారా మంటలను అదుపు చేశారు.