నాంపల్లి, సెప్టెంబర్ 1 : సబ్బండ వర్గాల సంక్షేమమే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి అన్నారు. గురువారం మండంలోని రాందాస్తండాగ్రామపంచాయతీ పరిధిలోని రావికుంటతండాలో గ్రామానికి చెం దిన కాంగ్రెస్ నాయకులు 60మంది, జాన్తండాకు చెందిన కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు మెగావత్ యాదగిరితోపాటు 20 మంది కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మునుగోడు ప్రజల సమస్యలను కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఏ మాత్రం పట్టించుకోలేనది పేర్కొన్నారు.
కేవలం కాంట్రాక్టుల కోసమే రాజగోపాల్‌రెడ్డి బీజేపీలో చేరి మునుగోడు ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారని పేర్కొన్నారు. చిన్న చిన్న తండాలను గ్రామపంచాయతీలుగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందని అన్నారు. మునుగోడు ప్రజలను పట్టి పీడిస్తున్న ఫ్లోరోసిస్‌ను శాశ్వతంగా పారదోలి ఆ భూతం నుంచి ప్రజలను కాపాడిన టీఆర్ఎస్ వెంటే మునుగోడు ప్రజలు ఉండాలని కోరారు.
కార్యక్రమంలో రైతు బంధు సమి మండల కన్వీనర్ ఏడుదొడ్ల రవీందర్‌రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గుమ్మడపు నర్సింహారావు, టీఆర్ఎస్ జిల్లా నాయకుడు పానుగంటి వెంకన్న, సర్పంచుల ఫోరమ్ మండలాధ్యక్షుడు మునుగల సుధాకర్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి కోరె యాదయ్య, అధికార ప్రతినిధి పోగుల వెంకట్‌రెడ్డి, ఎస్టీ సెల్ అధ్యక్షుడు సఫావత్ సర్దార్‌నాయక్, టీఆర్ఎస్వీ మండలాధ్యక్షుడు బత్తుల విజయ్, సప్పిడి శ్రీనివాస్‌రెడ్డి, రమావత్ బాలాజీ, మెగావత్ ధర్మా, జగన్, రమేశ్, రూప్లా, వంశి, టీఆర్ఎస్ నాయకులు
మర్రిగూడ : మండలంలోని దామెరభీమనపల్లి, కమ్మగూడెం, బోజ్యాతండా, భీమ్లాతండాలకు చెందిన 30 కాంగ్రెస్ కుటుంబాలు, యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు ఎంపీటీసీ శిలువేరు విష్ణు, టీఆర్ఎస్ గ్రామశాఖల అధ్యక్షులు నడిమింటి శ్రీను, కొయ్య ఆరోగ్యయ్య ఆధ్వర్యంలో గురువారం మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు.
వారికి మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల జడ్పీటీసీ పాశం సురేందర్‌రెడ్డితో కలిసి గులాబీ కండువాలు కప్పి టీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు ఆంగోతు విజయ్‌కుమార్, మార్నేని అంతయ్య, మల్గిరెడ్డి కృష్ణారెడ్డి, చెక్క శేఖర్, సుధాకర్, జిల్లా స్వామి, సుధాకర్, పెంటి నర్సింహ, నడిమింటి శ్రీకాంత్ పాల్గొన్నారు.