కొండమల్లేపల్లి, జూలై 28 : రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలను టీఆర్ఎస్ కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని, తద్వారా పార్టీని బలోపేతం చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ చందంపేట మండల ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని గురువారం కొండమల్లేపల్లి మండల కేంద్రంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజల అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పాలన సాగిస్తున్నారన్నారు.
పథకాలు అర్హులకు అందేలా కార్యకర్తలు చూడాలన్నారు. సమావేశంలో టీఆర్ఎస్ చందంపేట మండలాధ్యక్షుడు ముత్యాల సర్వయ్య, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు దొండేటి మల్లారెడ్డి, రైతుబంధు సమితి అధ్యక్షుడు బోయపల్లి శ్రీనివాస్‌గౌడ్, నాయకులు శిరందాసు కృష్ణయ్య, యాసాని రాజవర్ధన్‌రెడ్డి, రమావత్ మోహనకృష్ణ, కేతావత్ శంకర్‌నాయక్, కేతావత్ లక్ష్మణ్‌నాయక్, గోసుల అనంతగిరి, వేముల రాజు, బొడ్డుపల్లి కృష్ణ, సయ్యద్ పాల్గొన్నారు.
సీఎం సహాయనిధి చెక్కు పంపిణీ
దేవరకొండ : పట్టణలోని 11వ వార్డుకు చెందిన ఆసియా బేగంకు సీఎం సహాయనిధి నుంచి మంజూరైన రూ.1.50 లక్షల చెక్కును గురువారం ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ తన క్యాంపు కార్యాలయంలో అందించారు. ఆపదలో ఉన్న పేదలందరికీ సీఎం సహాయనిధి ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటున్నదని చెప్పారు. కార్యక్రమంలో టీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేముల రాజు, తౌఫిక్ ఖాద్రి, పనబోయిన సైదులు, బొడ్డుపల్లి కృష్ణ పాల్గొన్నారు.
రాములు మృతికి సంతాపం
మాల్ : మండలంలోని వింజమూరు గ్రామానికి చెందిన టీఆర్ఎస్ నాయకుడు ఆరెకంటి రాములు గురువారం మృతి చెందాడు. ఎమ్మెల్యే రవీంద్రకుమార్ గ్రామానికి వెళ్లి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన వెంట నాయకులు ఉజ్జిని విద్యాసాగర్‌రావు, రాజవర్ధన్‌రెడ్డి, వింజమూరి రవి, దండేటికార్ లలితాబాయ్ మోహన్, ప్రసాద్, బిచ్చానాయక్, ఆరెకంటి చంద్రయ్య, జంగయ్య, రాములు, శంకరయ్య, భార్గవ్, కోటేశ్ ఉన్నారు.