మునగాల, మార్చి 1 : క్రీడలు స్నేహబావాన్ని పెంపొందిస్తాయని డీఎస్ఆర్ డెవలపర్స్ అధినేత దుశ్చర్ల శ్రీనివాస్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో శివరాత్రి సందర్భంగా ఘనీ యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కబడ్డీ పోటీల్లో క్రీడారుల పరిచయ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. మండల కేంద్రానికి చెందిన కాసర్ల పెద్ద వెంకటాద్రి కుటుంబీకులు క్రీడాకారులకు దుస్తులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మునగాల సొసైటీ చైర్మన్ కందిబండ సత్యనారాయణ, మాజీ సర్పంచ్ కాసర్ల కోటయ్య, మాజీ ఉప సర్పంచ్ ఉప్పుల మట్టారెడ్డి, వార్డు సభ్యులు సాల రవి, వెంకట్, శ్రీనివాస్, క్రీడాకారులు పాల్గొన్నారు.