సూర్యాపేట రూరల్, ఫిబ్రవరి 1 : విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, సునీత దంపతులు పిల్లలమర్రి గ్రామంలోని చారిత్రక శివాలయాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు, శివలింగానికి అభిషేకాలు జరిపించారు. జిల్లా కేంద్రంలోని శ్రీ వీరభద్రస్వామి, శ్రీ అన్నపూర్ణ సహిత విశ్వనాథ స్వామి దేవాలయాల్లోనూ పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారికి ఆలయాల అర్చకులు, కమిటీ సభ్యులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు.
అర్చకులు స్వామి వారి ఆశీర్వచనంతో పాటు తీర్థ ప్రసాదాలు అందజేశారు. మంత్రి వెంట ఎంపీ, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్యయాదవ్, డీసీఎంఎస్ చైర్మన్ వట్టె జానయ్యయాదవ్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, మున్సిపల్ కమిషనర్ రామానుజులరెడ్డి, మార్కెట్ చైర్పర్సన్ ఉప్పల లలితా ఆనంద్, మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్టా కిశోర్, అనిల్‌రెడ్డి, శ్రీహర్ష, మారిపెద్ది శ్రీనివాస్‌గౌడ్, పిల్లలమర్రి ఆలయ చైర్మన్ వల్లాల సైదులుయాదవ్, కొండపల్లి దిలీప్‌రెడ్డి, చింతలపాటి భరత్, ఎలిమినేటి అభినయ్, అయ్యన్న పాల్గొన్నారు.