బొమ్మలరామారం, జూన్ 2 : యువత క్రీడా ప్రాంగణాలను వినియోగించుకోవాలని జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని నాగినేనిపల్లిలో క్రీడా ప్రాంగణాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడలతో దేహదారుఢ్యం, స్నేహభావం పెంపొందుతుందన్నారు. అనంతరం నాగినేనిపల్లి పాఠశాల వార్షికోత్సవ పుస్తకం ‘నాగ మల్లెలు’ను ఆవిష్కరించారు. ఎంపీపీ చిమ్ముల సుధీర్‌రెడ్డి, ఎంపీడీఓ సరిత, ఏపీఎం పుష్పలత, హెచ్ఎం శ్రీనివాస్, పీఏసీఎస్ చైర్మన్ గూదె బాలనర్సింహ, సర్పంచ్ భట్కీర్ బీరప్ప, జేసీడీఓ నిర్మలాజ్యోతి, మాజీ సర్పంచ్ ఆంజనేయులు, టీఏ పుష్పలత పాల్గొన్నారు.
గుండాల : మండలంలోని పాచిల్ల, సుద్దాల గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలను ఎంపీపీ తాండ్ర అమరావతీశోభన్బాబు, జడ్పీటీసీ కోలుకొండ లక్ష్మీరాములు, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు ఎండీ ఖలీల్ గురువారం ప్రారంభించారు. యువత క్రీడా ప్రాంగణాలను వినియోగించుకోవాలని సూచించారు. అనంతరం క్రీడా ప్రాంగణంలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ మహేందర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మూగల శ్రీనివాస్, సర్పంచులు పందుల రేఖాయాదగిరి, చిందం వరలక్ష్మీప్రకాశ్, ఎంపీటీసీ కుంచాల సుశీలాఅంజిరెడ్డి, మండల పరిషత్ కో ఆప్షన్ సభ్యుడు షర్పొద్దీన్, రైతు బంధు సమితి మండల కన్వీనర్ గడ్డమీది పాండరి, మాజీ ఎంపీపీ సంగి వేణుగోపాల్, తాసీల్దార్ శ్రీనివాస్‌రాజ్, ఎంపీడీఓ శ్రీనివాసులు, ఉప సర్పంచులు అత్తి భాస్కర్, రవి, ఈసీ మల్లేశ్, రెవెన్యూ అధికారులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
తుర్కపల్లి : యువత క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని ఎంపీపీ భూక్యా సుశీలారవీందర్, జడ్పీ వైస్ చైర్మన్ బీకూనాయక్ అన్నారు. మండలంలోని వాసాలమర్రిలో క్రీడా ప్రాంగణాన్ని వారు ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచ్ పోగుల ఆంజనేయులు, పీఏసీఎస్ చైర్మన్ సింగిరెడ్డి నరసింహారెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పిన్నపురెడ్డి నరేందర్‌రెడ్డి, మండల ప్రత్యేకాధికారి శ్యాంసుందర్, తాసీల్దార్ రవికుమార్, ఎంపీడీఓ ఉమాదేవి, ఎంపీఓ శ్రీమాలిని, ఏపీఓ నర్సయ్య, రాంరెడ్డి పాల్గొన్నారు.
యాదగిరిగుట్ట రూరల్ : మండలంలోని మాసాయిపేటలో క్రీడాప్రాంగణాన్ని ఎంపీపీ చీర శ్రీశైలం, జడ్పీటీసీ తోటకూరి అనూరాధ, సర్పంచ్ వంటేరు సువర్ణాఇంద్రాసేనారెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ ననబోలు ప్రసన్న, ఎంపీడీఓ కారం ప్రభాకర్‌రెడ్డి, ఉప సర్పంచ్ వాకిటి అమృత, టీఆర్ఎస్ జిల్లా నాయకుడు వంటేరు సురేశ్‌రెడ్డి, నాయకులు గుణగంటి బాబూరావు, సొప్పరి మధు, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.