మన ఊరు మన బడిలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని అందుబాటులోకి తెస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఆ మేరకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నది. ఇప్పటివరకు పాఠ్యపుస్తకాలు తెలుగు, లేదంటే ఇంగ్లిష్‌లో ఉండగా.. 2022-23 విద్యాసంవత్సరం నుంచి రెండు భాషల్లోనూ ప్రచురించనున్నది. ఇన్నాళ్లూ తెలుగు మాధ్యమంలో చదివిన విద్యార్థులు ఒకేసారి ఇంగ్లిష్‌ను అర్థం చేసుకోవడం కష్టమని భావించి.. అభ్యాసనను సులువు చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నది. ఒకే పుస్తకంలో ఒకవైపు ఇంగ్లిష్, మరోవైపు తెలుగులో పాఠం ఉండేటట్లు ముద్రిస్తున్నది. రెండు భాషల్లో పాఠాలు ఉండాల్సి వస్తుండడం వల్ల పేజీల సంఖ్య పెరుగుతుండడంతో రెండు భాగాలుగా విభజిస్తున్నది. ఒకటి నుంచి 8వ తరగతి వరకు ఈ పుస్తకాలు అందుబాటులోకి తెస్తున్నది. ఆంగ్ల మాధ్యమంలో బోధనకు మార్చి 21 నుంచి ఏప్రిల్ 9 వరకు మూడు విడుతల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉపాధ్యాయులకు విద్యాశాఖ ప్రత్యేక శిక్షణ ఇచ్చింది. వెబినార్లతోనూ సందేహాలు నివృత్తి చేస్తున్నది. సర్కారు నిర్ణయంతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో విశ్వాసం పెరుగుతుందని విద్యావేత్తలు చెప్తున్నారు.
రామగిరి, మే 27 : సర్కార్ 2022-23 విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్లమాధ్యమం అమల్లోకి తెస్తున్న విషయం విదితమే. అయితే ఇప్పటి వరకు ఉన్న ప్రభుత్వ పాఠ్యపుస్తకాలు (తెలుగు, ఇంగ్లిష్) మీడియం వేర్వేరుగా ఉన్నాయి. ఇప్పటి వరకు తెలుగు మీడియం చదివిన విద్యార్థులు ఒకే పర్యాయం ఆంగ్లమాధ్యమం అర్థం చేసుకోవడం కష్టమేనని భావించిన ప్రభుత్వం, విద్యాశాఖ వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టింది. ఒకే పాఠ్య పుస్తకంలో ఒకవైపు ఇంగ్లిష్, మరోవైపు తెలుగులో అదే పాఠం ఉండేలా పాఠ్యపుస్తకాలను ముద్రిస్తున్నది. 1నుంచి 8వ తరగతి వరకు ఈ పుస్తకాలు అందుబాటులోకి వస్తుండడం విశేషం. ‘మన ఊరు-మన బడి’లో భాగంగా ఆంగ్లమాధ్యమం అందుబాటులోకి తెస్తుండడంతో మార్చి 21నుంచి ఏప్రిల్ 9వరకు మూడు విడుతల వారీగా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉపాధ్యాయులకు ఆంగ్లమాధ్యమం బోధనపై విద్యాశాఖ ప్రత్యేక శిక్షణ ఇచ్చి అవగాహనకు వెబినార్ సైతం నిర్వహించి పూర్తిస్థాయిలో భరోసా కల్పించారు. పాఠ్యపుస్తకాలు ద్విభాషలో ఉండటంతో పేజీల సంఖ్య పెరుగుతుండటంతో వాటిని రెండు భాగాలుగా తయారు చేస్తున్నారు. దీంతో ప్రజల్లో ప్రభుత్వ బడులపై మరింత విశ్వాసం పెరుగడంతో పాటు విద్యార్థుల సంఖ్య సైతం పెరుగుతుందని విద్యాశాఖ భావిస్తున్నది.
నల్లగొండ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 3,309 ప్రభుత్వ, గురుకుల పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 3,56,793మంది విద్యార్థులు చదువుతుండగా 19,35,058 వివిధ టైటిల్స్(సబ్జెక్టు) పుస్తకాలు అవసరం ఉన్నట్లు ఆయా జిల్లాల విద్యాశాఖ అధికారులు అంచనా వేశారు. పాఠశాలలు పునఃప్రారంభం నాటికి వీటిని విద్యార్థులకు అందించే చర్యలు తీసుకుంటున్నారు.
:- FAMILY
Rama : Grand pa who is the tall boy in the photo ?
Grandfather : He is your father, Srinivas
Rama : OK is this girl in half sari ?
Grandfather : Dont you recognize her? She is your aunt Sujatha
Rama : Is it Venkat uncle beside father
రమ : తాతయ్యా ! ఈ ఫొటోలో
పొడుగ్గా ఉన్న బాలుడు ఎవరు ?
తాతయ్య : మీ నాన్న శ్రీనివాస్
రమ : లంగా, ఓణీ వేసుకున్నవారు
ఎవరు ?
తాతయ్య : గుర్తుపట్టలేదా ? మీ
అత్త సుజాత
రమ : నాన్న పక్కన ఉన్నది
చిన్నాన్న వెంకట్ కదా !