నార్కట్‌పల్లి మే 27 : ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతోనే మారుమూల పల్లెలూ ఎంతో అభివృద్ధి చెందుతున్నాయని జడ్పీ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. శుక్రవారం మండలంలోని జువ్విగూడెం ఆవాస గ్రామాలైన వెంకటేశ్వర్ల బావి గ్రామంలో సీఆర్ఆర్ నిధులు రూ. కోటి 20 లక్షలతో నిర్మించనున్న బీటీ రోడ్డుకు వారు శంకుస్థాపన చేశారు. అనంతరం పెద్దబావికుంట, సప్పిడిగూడెం, గద్దగూటి బావి, నక్కలపల్లిలో రూ. 82.50 లక్షలతో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులను ప్రారంభించారు.
ఈసందర్భంగా వారు మాట్లాడుతూ పల్లెలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందనే ఉద్దేశంతో ప్రభుత్వం అనేక నిధులను మంజూరు చేసి పల్లెలను అభివృద్ధి చేస్తున్నదన్నారు. గ్రామీణ క్రీడాకారుల కోసం ఊరికి ఒక ఆట స్థలం నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసిందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెడుతున్న ప్రజా సంక్షేమ పథకాలు పేదల ఇంట్లో దీపాలుగా వెలుగుతున్నాయన్నారు. దేశంలోని అన్ని రాష్ర్టాలు నంబర్‌వన్‌గా ఉన్న తెలంగాణ వైపు చూస్తున్నాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్‌రెడ్డి, గ్రామాభివృద్ధి కమిటీ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, పార్టీ మండలాధ్యక్షుడు కరుణాకర్‌రెడ్డి, సర్పంచులు సుధీర్‌రెడ్డి, ప్రేమలత, మాధవీనర్సింహ, ఎంపీటీసీలు, రాజిరెడ్డి, అంజయ్య, దేవకమ్మ, జగన్మోహన్రెడ్డి, సత్త య్య, రవి, శ్రీధర్, విష్ణుమూర్తి పాల్గొన్నారు.