ఓటరు నమోదుకు ఎన్నికల సంఘం గడువు ఇచ్చింది.కొత్త వారి నుంచి ఈనెల 30 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నది. వచ్చే సంవత్సరం జనవరి వరకు 18 ఏండ్లు నిండనున్న యువతీ, యువకులు నమోదు చేసుకోవచ్చు. గరుడ యాప్ ద్వారా ఆన్‌లైన్‌లోనూ అప్లై చేసుకునే వెసులుబాటు ఉన్నది. అలాగే జాబితాలో తప్పుల సవరణకు సైతం ఈ ప్రత్యేక డ్రైవ్‌లో అవకాశంకల్పించింది. దీంతో కొత్త ఓటర్లతోపాటు పాత వారికీ ప్రయోజనం
కలుగనున్నది. ఈ నెల 1న ముసాయిదా జాబితా విడుదల చేసింది.
నాగర్‌కర్నూల్, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ) : వయోజనులు ఓటర్లుగా పేర్లు నమో దు చేసుకునేందుకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. జనవరి 2022 నాటికి 18 ఏండ్లు నిండనున్న యువతీయువకులు పే ర్లు నమోదు చేసుకోవచ్చు. ఇందుకుగానూ బీ ఎల్వోలతోపాటు ఆన్లైన్ ద్వారా కూడా దరఖాస్తులు స్వీకరించనున్నది. మీ సేవ కేంద్రా లు, స్మార్ట్ఫోన్లలో దరఖాస్తులు చేసుకునే అ వకాశం ఉన్నది. ఎన్నికల సంఘం ప్రత్యేకంగా గరుడ యాప్‌ను రూపొందించింది. యాప్‌పై అధికారులు విస్తృత ప్రచారం చేయనున్నారు. ఓటరు రిజిస్ట్రేషన్ కోసం ఫారం-6, చిరునామా మార్పునకు ఫారం-8ఏ, సవరణకు ఫారం-8, ఓటరు జాబితాలో పేరు తొలగించేందుకు ఫారం-7 ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఎ న్నికల సమయంలోనే కాకుండా నిరంతరం కొత్త ఓటర్ల నమోదు చేపడుతుండడంతో ఓట ర్ల నమోదు, అడ్రస్, తప్పులు సవరించుకోవ డం సులభంగా మారనున్నది. ఎన్నికల అధికారులు కూడా ఒత్తిడి లేకుండా పని చేసే పరిస్థితులు ఉండడంతో ఓటర్ల నమోదు ప్రక్రియ చక్కగా జరుగుతున్నది. ఇందులో భాగంగా న వంబర్ 1న ఎన్నికల సంఘం ఓటర్ల ముసాయిదా జాబితా విడుదల చేసింది. పోలింగ్ కేం ద్రాల్లో ఈ జాబితాలను అధికారులు అందుబాటులో ఉంచే ఏర్పాట్లు చేపట్టారు. కాగా ఈ నెల 30వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకునే అవకాశం కల్పించారు. దరఖాస్తులను డిసెంబర్ 20వ తేదీ వరకు అధికారులు పరిశీలిస్తా రు. వచ్చే ఏడాది జనవరి 5వ తేదీన తుది జాబితా ప్రచురించనున్నారు. అధికారులు ము ఖ్యంగా సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేపట్టి ఓటర్లు, యువతలో అవగాహన క ల్పించనున్నారు. నాగర్‌కర్నూల్ జిల్లాలో నూ ఓటర్ల ముసాయిదా జాబితా విడుదలైంది. జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో పురుష ఓటర్లు 4,45, 318 మంది ఉండగా.. మహిళా ఓటర్లు 4,35,545 మంది ఉన్నారు. ఇతరులు 13 మంది.. ఇలా జిల్లాలో 8,80,975 మంది ఓటర్లు ఉన్నారు.