నందికొండ: నాగార్జునసాగర్ డ్యాం 2 క్రస్ట్ గేట్ల ద్వారా 24848 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. రిజ ర్వాయర్ పూర్తి నీటి సామర్ధ్యం 590 (312.0450 టీఎంసీలు) అడుగులకు గాను 589.80 (311.4474 టీఎంసీ లు) మేరకు నీరు నిల్వ ఉంది.
రిజర్వాయర్ నుంచి కుడి కాల్వ ద్వారా 8541 క్యూసెక్కులు, ఎడమకాల్వ ద్వారా 9700 క్యూసెక్కులు, ప్రధాన జల విద్యుత్ కేంద్రం ద్వారా 24522 క్యూసెక్కులు, ఎస్ఎల్బీసీ ద్వారా 1800 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
వరద కాల్వ ద్వారా నీటి విడుదల లేదు.
రిజర్వాయర్‌కు 69411 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతుండగా, అదే స్థాయిలో అవుట్‌ఫ్లో కొనసా గుతుంది. శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులకు 884.80 అడుగుల వద్ద 214.3637 టీఎంసీల నీరు నిల్వ ఉంది. శ్రీశైలంకు 51801 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది.