నందికొండ: నాగార్జునసాగర్ డ్యాం 2 క్రస్ట్ గేట్ల ద్వారా 16138 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్ రిజ ర్వాయర్ పూర్తి నీటి సామర్ధ్యం 590 (312.0450 టీఎంసీలు) అడుగులకు గాను 589.70 (311.1486 టీఎంసీలు) మేరకు నీరు నిల్వ ఉంది.
నాగార్జునసాగర్ రిజర్వాయర్ నుంచి కుడి కాల్వ ద్వారా 9274 క్యూసెక్కులు, ఎడమ కాల్వ ద్వారా 6870 క్యూసెక్కు లు, ప్రధాన జలవిద్యుత్ కేంద్రం ద్వారా 26390 క్యూసెక్కులు, వరద కాల్వ ద్వారా 300 క్యూసెక్కులు, ఎస్ఎల్బీసీ ద్వారా 1800 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
కాగా నాగార్జునసాగర్ రిజర్వాయర్‌కు 60772 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతుండగా, అదే స్థాయిలో అవుట్‌ఫ్లో కొనసాగుతున్నది. శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులకు 883.30 అడుగుల వద్ద 206. 0996 టీఎంసీల నీరు నిల్వ ఉంది. శ్రీశైలంకు 71427 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది.